తెలంగాణ

telangana

ETV Bharat / state

Pawan Khera On Telangana Elections 2023 : 'ఎవరి మద్దతూ లేకుండా.. తెలంగాణలో గెలిచి చూపిస్తాం' - హైదరాబాద్‌లో పవన్ ఖేరా ప్రెస్ మీట్

Pawan Khera On Telangana Elections 2023 : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరి మద్దతు లేకుండానే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది ఏఐసీసీ మీడియా విభాగం ఇంఛార్జ్ పవన్ ఖేరా ధీమా వ్యక్తం చేశారు. సీడబ్ల్యూసీ సమావేశాల్లో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అనుసరించాల్సిన అజెండాపై చర్చిస్తున్నట్లు తెలిపారు. మొదటి రోజున సుదీర్ఘంగా ఫలవంతమైన చర్చలు జరిపినట్లు వెల్లడించారు. కాంగ్రెస్‌కు భయపడి బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ పార్టీలు జుగల్బందీగా కలిసి కదులుతున్నాయని అన్నారు.

Pawan Khera On Telangana Elections 2023
Pawan Khera

By ETV Bharat Telangana Team

Published : Sep 17, 2023, 12:59 PM IST

Pawan Khera On Telangana Elections 2023 :కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. హైదరాబాద్ వేదికగా హోటల్‌ తాజ్‌కృష్ణాలో రెండ్రోజుల పాటు సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో మొదటి రోజైన శనివారం నిరుద్యోగం, రాజకీయ, ఆర్థిక అంశాలపై చర్చించారు. అదే విధంగా మణిపుర్, దేశ భూ ఆక్రమణలు తదితర అంశాలపై సీడబ్ల్యూసీ చర్చలు జరిపినట్లు తెలిసింది. మరోవైపు ఇవాళ జరగనున్న సీడబ్ల్యూసీ భేటీలో పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు పాల్గొననున్నారు.

Pawan Khera On CWC Meeting 2023 :ఇవాళ జరగనున్న సీడబ్ల్యూసీసమావేశాల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో అనుసరించాల్సిన అజెండాపై చర్చించనున్నట్లు సమాచారం. ఎన్నికల రాష్ట్రాల్లో అనుసరించాల్సిన రోడ్ మ్యాప్ ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు శనివారం రోజున సుదీర్ఘంగా, ఫలవంతంగా సమావేశాలు జరిగాయని ఏఐసీసీ మీడియా విభాగం ఇంఛార్జ్ పవన్ ఖేరా(AICC Media Incharge Pawan Khera) తెలిపారు. ఇవాళ తాజ్ కృష్ణాలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన పలు అంశాలపై మాట్లాడారు.

CWC Meeting Hyderabad 2023 :మహిళా రిజర్వేషన్ల బిల్లు(Women Reservation Bill) చరిత్ర చాలా ఉందని పవన్ ఖేరా అన్నారు. 1989లోనే రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. పలుమార్లు ఉభయ సభల ముందుకు వచ్చినా ఆమోదం పొందలేదని.. మన్మోహన్ సింగ్ హయాంలో రాజ్యసభలో బిల్లు పాసై లైవ్​గా ఉందని చెప్పారు. ప్రత్యేక సమావేశాల్లో బిల్లును ఆమోదించాలని సీడబ్ల్యూసీ తీర్మానించిందని వెల్లడించారు.

CWC Meetings in Hyderabad : హైదరాబాద్‌లో రెండోరోజు సీడబ్ల్యూసీ సమావేశాలు.. ఆ అంశాలపై మరింత విస్తృతంగా సమాలోచనలు

"కాంగ్రెస్ పార్టీలోనే ఎందుకు చేరారని రాహుల్ గాంధీ సమావేశంలో ఖర్గేను అడిగారు. పేదలు, పీడితుల గురించి కాంగ్రెస్ మాత్రమే పట్టించుకుంటుందని చేరినట్లు ఖర్గే చెప్పారు. భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీ వెళ్లాల్సిన మార్గాన్ని సూచించింది. భరతమాత కష్టాలను యాత్ర ప్రతిధ్వనించింది. ఆ యాత్ర ఆధారంగానే కర్ణాటక, తెలంగాణలో గ్యారెంటీలను రూపొందించాం. బీజేపీ అసంబద్ధ అంశాల ట్రాప్‌లో పడొద్దని రాహుల్ గాంధీ మమ్మల్ని హెచ్చరించారు. రాహుల్ నుంచి నిన్న పార్టీకి, కార్యకర్తలకు స్పష్టత వచ్చింది. భారత్ జోడో రెండో విడత యాత్రపై చర్చ జరిగింది. దానిపై కాంగ్రెస్ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారు."- పవన్ ఖేరా, ఏఐసీసీ మీడియా విభాగం ఇంఛార్జ్

Pawan Khera on BRS :కుల గణన చేపట్టాలని.. రిజర్వేషన్లు పెంచాలన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఎప్పటి నుంచో చెబుతున్నారని పవన్ ఖేరా అన్నారు. సరిహద్దు విషయంలో ప్రధాని మోదీ దేశానికి ఎవరూ చేయని పెద్ద నష్టం కలిగించారని మండిపడ్డారు. చైనాకు భూభాగంతో పాటు సర్టిఫికెట్ కూడా ఇచ్చారని ఆరోపించారు. హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతుంటే బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్ అకస్మాత్తుగా సమావేశాలు పెట్టుకున్నారని అన్నారు. కాంగ్రెస్‌కు భయపడి ఈ మూడు పార్టీలు జుగల్బందీగా కలిసి ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ(Telangana Assembly Elections 2023)లో కాంగ్రెస్‌కు ఎవరి మద్దతు అక్కర్లేదని.. పూర్తి మెజారిటీతో తమ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని.. పవన్ ఖేరా ధీమా వ్యక్తం చేశారు.

Kishan Reddy Comments on CWC Meeting : 'తప్పుడు సర్క్యులర్‌ ఇవ్వడంపై క్షమాపణ చెప్పాలి'

Karnataka Deputy CM DK Shivakumar Visited Dumping Yard : జవహర్​ నగర్ డంపింగ్ యార్డ్​లో డీకే శివకుమార్

ABOUT THE AUTHOR

...view details