Pawan Kalyan Yuvashakti meeting : జనసేన చేపట్టిన యువశక్తి కార్యక్రమానికి ఏపీలోని శ్రీకాకుళం జిల్లా రణస్థలం సిద్ధమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి యువత తరలివస్తుండటంతో... ఎవరికీ, ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆ పార్టీ నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏపీలో ఎన్నడూ లేనంతగా యువశక్తి నిర్వీర్యమవుతున్న దుస్థితి.. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో నెలకొన్న పరిస్థితిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడనున్నారు.
"ఏం పిల్లడో ఎల్దమొస్తవా.." శ్రీకాకుళంలో జనసేనాని రణ నినాదం - Pawan Kalyan Yuvashakti meeting
Pawan Kalyan Yuvashakti meeting : ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం వేదికగా జనసేన అధినేత నేడు తలపెట్టిన యువశక్తి బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. వేలాది మంది జనసైనికులు తరలివచ్చినా సరిపడేలా సుభద్రాపురం వద్ద సభాస్థలాన్ని సిద్ధం చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. పోలీసులు ముందస్తుగా ఏర్పాట్లను పరిశీలించారు. ఇప్పటికే పవన్ జిల్లాకు చేరుకున్నారు.
మధ్యాహ్నం 12 గంటలకు యువశక్తి కార్యక్రమం ప్రారంభం కానుండగా.. తొలుత 100 మంది యువతీయువకుల సమస్యలు, సూచనలను బహిరంగసభ ద్వారా వినిపించనున్నారు. ప్రభుత్వ నిరంకుశత్వ వైఖరిపై ప్రశ్నిస్తున్న యువతపై తప్పుడు కేసులు పెడుతున్నారన్న జనసేన నాయకులు.. అలాంటివారికి యువశక్తి సభ వేదికగా పవన్ కల్యాణ్ భరోసా ఇవ్వనున్నారని తెలిపారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం రాత్రి విజయనగరం జిల్లా భోగాపురం సన్‌రైజ్ రిసార్ట్స్‌కు చేరుకున్నారు. స్థానిక జనసేన నాయకులు, అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
ఇవీ చదవండి :