సామాన్య కుటుంబంలో పుట్టి.. అసాధారణ వ్యక్తిగా ఎదిగిన చిరంజీవి... ఎందరికో స్ఫూర్తి ప్రదాత అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తన అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పవన్... కష్టపడి పనిచేసే తత్వమే చిరంజీవి విజయానికి సోపానమన్నారు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న పెద్దల మాటలు ఆయనను చూస్తే నిజమనిపిస్తాయని... అటువంటి కష్టపడే తత్వం ఉన్న వ్యక్తికి తమ్ముడిగా పుట్టడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
అన్నయ్య ఎందరికో స్ఫూర్తి ప్రదాత : పవన్ కల్యాణ్ - Chiranjeevi birthday news
కష్టపడి పనిచేసే తత్వమే అన్నయ్య చిరంజీవి విజయానికి కారణమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పవన్…. సామాన్య కుటుంబంలో పుట్టిన ఆయన అసాధారణ వ్యక్తిగా మారి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు.
అన్నయ్య ఎందరికో స్ఫూర్తి ప్రధాత : పవన్ కల్యాణ్
చిరంజీవి చేయిపట్టుకుని పెరిగానని... ఆయనే తన తొలి గురువని చిరంజీవిపై ఉన్న గౌరవాన్ని, ప్రేమను చాటుకున్నారు పవన్. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చిరస్మరణమైన స్థానాన్ని సంపాదించారని ప్రశంసించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అలవరుచుకున్నారని కొనియాడారు. అన్నయ్య చిరంజీవికి చిరాయువు ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
ఇవీ చదవండి:మెగాస్టార్.. మీరే మా స్ఫూర్తి, ధైర్యం