జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఈ నెల 21న సమావేశం కానుంది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో జరిగే ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పాటు పీఏసీ సభ్యులు పాల్గొంటారు. తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఈ సారి సమావేశం ఇక్కడ నిర్వహించనున్నారు. ఉప ఎన్నికలో పోటీతో పాటు, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.
ఈ నెల 21న తిరుపతిలో జనసేన భేటీ - జనసేన పార్టీ పీఏసీ సమావేశం వార్తలు
ఈ నెల 21న ఏపీలోని తిరుపతిలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ కానుంది. జనసేనాని పవన్ కల్యాణ్ ఇందులో పాల్గొననున్నారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో పార్టీ తరపున అభ్యర్థిని నిలబెట్టాలా?.. లేదా మిత్రపక్షమైన భాజపాకు మద్దతు ఇవ్వాలా? అనే అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు.
ఈ నెల 21న తిరుపతిలో జనసేన భేటీ
భాజపాతో పొత్తు నేపథ్యంలో అక్కడ ఏ పార్టీ తరపున అభ్యర్థిని నిలపాలనేది ఇంకా నిర్ణయించలేదు. మరోవైపు పోటీకి భాజపా ఉత్సాహం చూపుతోంది. ఈ తరుణంలో అక్కడ జనసేన పోటీ చేస్తుందా.. లేదా.. అన్నది ఈ కార్యక్రమంలో ప్రధాన ఎజెండా కానుంది. అలాగే పంచాయతీ ఎన్నికల విషయంపైనా చర్చించే అవకాశముంది.
ఇదీ చదవండి:నరసరావుపేట గోపూజలో పాల్గొన్న సీఎం జగన్