‘మీ పరిపాలన, ప్రభుత్వ పనితీరు మీ ఒక్క రాష్ట్రానికే కాదు... దేశంలోని అన్ని రాష్ట్రాలకు, రాజకీయ పార్టీలకూ మార్గదర్శకం, స్ఫూర్తిదాయకం’ అని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను ఉద్దేశించి జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ట్వీట్ చేశారు. శుభాభినందనలు తెలియజేశారు.
Powerstar Tweet: ముఖ్యమంత్రిపై పవన్‌కల్యాణ్ ప్రశంసల వర్షం - ap top news
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను అభినందిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు, అన్ని రాజకీయ పార్టీలకు మీ పరిపాలన మార్గదర్శకం, స్ఫూర్తిదాయకమని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
Powerstar Tweet
‘ఏ పార్టీ అయినా అధికారంలోకి రావడానికి రాజకీయం చేయాలి కానీ, వచ్చాక రాజకీయం చేయకూడదు. దీన్ని మీరు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు. మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మీకు నా శుభాకాంక్షలు’ అని పవన్‌కల్యాణ్ ట్వీట్లో వెల్లడించారు.
ఇదీ చూడండి:ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదం.. ఎంపీటీసీ దంపతుల దుర్మరణం