ఆంధ్రప్రదేశ్ మాదకద్రవ్యాల (ap drugs case)కు కేంద్రంగా మారిందని జనసేనాని పవన్‌కల్యాణ్ (Pavan Kalyan) వ్యాఖ్యానించారు. ఏపీ గంజాయి ప్రభావం దేశవ్యాప్తంగా ఉందని ట్వీట్ చేశారు. గంజాయి నివారణకు నేతలు చర్యలు తీసుకోవట్లేదని ట్విట్టర్ వేదికగా తెలిపారు. 2018లో తన పోరాటయాత్రలో చాలా ఫిర్యాదులు వచ్చాయన్న పవన్.. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పోరాటయాత్ర చేశానన్నారు.
ఏవోబీలో గంజాయి మాఫియాపై ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. నిరుద్యోగం, అక్రమ మైనింగ్‌పైనా ఫిర్యాదులు వచ్చాయని.. హైదరాబాద్ సీపీ, నల్గొండ ఎస్పీ వ్యాఖ్యల వీడియోను జనసేనాని ట్వీట్ చేశారు.