తెలంగాణ

telangana

ETV Bharat / state

కౌలు రైతు కుటుంబాలకు పవన్ పరామర్శ.. రూ. లక్ష ఆర్థిక సాయం - ఏపీ వార్తలు

Pawan kalyan: ఆంధ్రప్రదేశ్​ ఏలూరు జిల్లాలో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ పర్యటించారు. పెదవేగి మండలం విజయరాయిలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు మల్లికార్జున కుటుంబాన్ని పరామర్శించిన పవన్.. రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందించారు.

Pawan kalyan tour in eluru
కౌలు రైతు కుటుంబాలకు పవన్ పరామర్శ.. రూ. లక్ష ఆర్థిక సాయం

By

Published : Apr 23, 2022, 3:13 PM IST

Pawan kalyan: జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఏపీలోని ఏలూరు జిల్లాలో.. కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టారు. జిల్లాకు వచ్చిన ఆయనకు.. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.. గజమాలతో ఘన స్వాగతం పలికారు. పెదవేగి మండలం విజయరాయిలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు మల్లికార్జున కుటుంబాన్ని.. పవన్‌ పరామర్శించారు. మృతుని భార్యకు రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబ నేపథ్యం వివరాలను అడిగి తెలుసుకుని.. తాను అండగా ఉంటానని ధైర్యం చెప్పారు.

అంతకుముందు పవన్‌కల్యాణ్‌కు స్వాగతం పలికేందుకు.. భారీగా అభిమానులు, జనసైనికులు తరలివచ్చారు. గజమాలతో అధినేతకు స్వాగతం పలికారు. ఈ క్రమంలో దుగ్గిరాల వద్ద పవన్ కాన్వాయ్‌ను అనుసరిస్తున్న బైక్‌ను.. కారు ఢీకొంది. దీంతో బైక్‌పై ఉన్న వ్యక్తికి గాయాలవ్వగా.. ఆస్పత్రికి తరలించారు. లింగపాలెం వద్ద పవన్ ప్రయాణిస్తున్న కారుకు పంక్చర్‌ అయ్యింది. పంక్చర్‌ వేసేవరకు.. పవన్ కల్యాణ్ ఆక్కడే ఉండి పర్యటన కొనసాగిస్తున్నారు.

లింగపాలెం మండలం ధర్మాజీగూడెం, చింతలపూడి మండలంలో ఆత్మహత్య చేసుకున్న పదకొండు రైతు కుటుంబాలను.. పవన్ పరామర్శించనున్నారు. అనంతరం రచ్చబండ సభలో పవన్ పాల్గొని ప్రసంగించనున్నారు.

ఏలూరులో పవన్ పర్యటన.. కౌలు రైతు కుటుంబాలకు పరామర్శ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details