ఆంధ్రప్రదేశ్ విశాఖలో గ్యాస్ ప్రమాద బాధితులకు సాయం చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. గ్యాస్ లీక్ ఘటనపై కొన్ని పార్టీలు విశాఖలో ఆందోళన చేస్తుండడం... కరోనా సమయంలో ఇలాంటి పని సరి కాదన్నారు. దీనివల్ల కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆందోళనలు వద్దు.. అండగా నిలబడదాం: పవన్ - విశాఖ గ్యాస్ లీక్
ఏపీలో విశాఖలో గ్యాస్ లీకేజీ బాధితులకు అండగా నిలవాలని జనసైనికులకు అధినేత పవన్ పిలుపిచ్చారు. కరోనా వేళ ఆందోళనలు చేయడం సరికాదని రాజకీయ పార్టీలకు హితవు పలికారు. ప్రమాదంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తుది నివేదిక వచ్చే వరకూ వేచి చూడాలన్నారు.
ఆందోళనలు వద్దు.. అండగా నిలబడదాం: పవన్
జనసేన నేతలు, కార్యకర్తలు ఆందోళనలో పాల్గొనవద్దని పవన్ కోరారు. ఆందోళనకు ఇది సమయం కాదన్న పవన్.. బాధితులకు అండగా ఉండాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తుది నివేదికలు వచ్చే వరకు వేచి చూడాలని అందరినీ కోరారు.