తెలంగాణ

telangana

ETV Bharat / state

పోరాటం.. ఏ స్థాయిలో చేశామన్నది ముఖ్యం: పవన్

ఏపీలో జరుగుతోన్న విపరీతమైన దౌర్జన్యాలు, దాష్టీకాల మధ్య ఒక ఆశయాన్ని నమ్మి.. దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి చాలా గుండె ధైర్యం కావాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతమంది నిలబడ్డామన్న దానికంటే.. ఏ స్థాయిలో పోరాటం చేశామన్నది ముఖ్యమన్నారు.

pawan-kalyan-on-muncipal-elections
పోరాటం.. ఏ స్థాయిలో చేశామన్నది ముఖ్యం: పవన్

By

Published : Mar 17, 2021, 8:16 AM IST

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో గుండె ధైర్యం ఉన్న మహిళలు, యువకులు బలంగా నిలబడి విజయం సాధించారన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. ఎన్నో ఒత్తిళ్లు, దౌర్జన్యపూరిత వాతావరణంలో.. గెలుపొందిన, పోటీ చేసిన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. విజయం సాధించిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా ఎదురైన అనుభవాలను అభ్యర్థుల ద్వారా తెలుసుకున్నారు పవన్.

పార్టీ నిర్మాణమనేది ఓ సాహసోపేతమైన చర్య అని పవన్ అన్నారు. అన్ని కులాలు, వర్గాలు బాగుండాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్లడం ఎంతో కష్టమని వివరించారు. అధికారంలో ఉన్న వారు డబ్బులిచ్చి సమాజాన్ని పాడు చేస్తుంటే నిజాయితీపరులు నలిగిపోతున్నారన్నారు. నాయకులు చూపిన స్ఫూర్తితో.. పదింతల విశ్వాసంతో తాను పార్టీని ముందుకు తీసుకెళ్తానని ఆయన వివరించారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక.. పోరుకు సిద్ధమవుతున్న పార్టీలు

ABOUT THE AUTHOR

...view details