Janasena leaders Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో కూల్చివేతలతో పరిపాలన ప్రారంభించిన వైసీపీ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్ఛరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో రోడ్ల విస్తరణ పేరుతో ఇళ్లు కూల్చివేయటంపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చినందుకే గ్రామస్థులపై ప్రభుత్వం కక్ష కట్టిందని ఆరోపించారు. మనకు ఓటేయనివారు శత్రువులన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉందని ఆరోపించారు. వైసీపీకి ఓట్లేసిన 49.95 శాతం మందికి మాత్రమే పాలకులం అన్నట్లుగా ప్రభుత్వ తీరుందని ఎద్దేవా చేశారు. ఇప్పటం గ్రామంలో ఇప్పటికే 70 అడుగుల రోడ్డు ఉంటే ఇంకా విస్తరణ ఏమిటన్నారు.
కూల్చివేతల వైసీపీ త్వరలోనే కూలిపోతుంది: పవన్‌కల్యాణ్ - Pawan Kalyan is angry about the demolition
Janasena leaders Pawan Kalyan: ఏపీలో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలోని ఇళ్ల కూల్చివేతపై పవన్‌కల్యాణ్ స్పందించారు. జనసేన ఆవిర్భావ సభకు గ్రామస్థులు స్థలం ఇచ్చినందుకే ప్రభుత్వం కక్ష కట్టిందని ఆరోపించారు. ఆర్టీసి బస్సులు కూడా రాని గ్రామంలో 120 అడుగుల రోడ్లు వేస్తామని స్థానిక ఎమ్మెల్యే చెప్పటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
ఆర్టీసీ బస్సులు కూడా రాని గ్రామంలో 120 అడుగుల రోడ్లు వేస్తామని స్థానిక ఎమ్మెల్యే చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. కూల్చివేత నోటీసులపై గ్రామస్థులు ఇప్పటికే కోర్టుకు వెళ్లారని.. దీంతో ఆఘమేఘాల మీద ఇళ్ల కూల్చివేత చేపట్టారని ఆరోపించారు. ఉదయం నుంచి పోలీస్ బలగాల సాయంతో జేసీబీలతో నిర్ధాక్షిణ్యంగా కూల్చి వేస్తున్నారని తెలిపారు. రోడ్డు పక్కనే ఉన్న మంచినీటి ట్యాంక్ వదిలి.. దాని పక్కన ఇంటిని కూలగొట్టారని విమర్శించారు. అక్కడ ఆందోళనకు దిగిన జన సైనికులు, వీర మహిళలను కూడా పోలీసులు అరెస్టు చేయటం దుర్మార్గమన్నారు. ఇప్పటం గ్రామస్తుల పోరాటానికి జనసేన అండగా నిలబడుతుందని స్పష్టం చేశారు. రెండురోజుల క్రితం నాదెండ్ల మనోహర్ ఇప్పటం వెళ్లినప్పుడు గ్రామంలో విద్యుత్‌ను నిలిపివేసి తమ కుసంస్కారాన్ని ప్రదర్శించారన్నారు. ఈ ప్రభుత్వం కూలిపోయే రోజు ఎంతో దూరం లేదని తెలిపారు.
ఇవీ చదవండి: