కరోనా మహమ్మారిపై పోరుకు విరాళాలు భారీగా వస్తున్నాయి. నివారణ చర్యల కోసం తన వంతు సహాయం చేస్తానని సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదిక ద్వారా తెలిపారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి చెరో 50 లక్షల రూపాయలు, ప్రధాన మంత్రి సహాయనిధికి రూ.కోటి విరాళం ప్రకటించారు.
పవన్ దాతృత్వం: కరోనాపై పోరుకు భారీ విరాళం - కరోనా
కరోనా నివారణ కోసం తనవంతు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు సినీనటుడు, జనసేనపార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ముందుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయనిధితోపాటు ప్రధానమంత్రి సహాయనిధికి భారీ విరాళం ప్రకటించారు.

pawan kalyan respond about carona
ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భారీగా విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే.
Last Updated : Mar 26, 2020, 12:37 PM IST