తెలంగాణ

telangana

ETV Bharat / state

వర్సిటీలను అధికార పార్టీ కార్యాలయాలుగా మార్చొద్దు: పవన్

Pawan Kalyan Comments on Universities: సీఎం జగన్‌ జన్మదిన వేడుకలకు విశ్వవిద్యాలయాల్లో ఫ్లెక్సీలు కట్టి వేడుకలు నిర్వహించటంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తీవ్రంగా స్పందించారు. విశ్వ విద్యాలయాలు విద్యార్థులను సామాజిక, రాజకీయ, ప్రాపంచిక విషయాలపై చైతన్యవంతులను చేయాలని పవన్‌ అన్నారు. రాష్ట్రంలోని ప్రఖ్యాత విశ్వ విద్యాలయాలు ఆ బాధ్యతను విస్మరించి వర్సిటీలను అధికార పార్టీ కార్యాలయాలుగా మార్చేశాయని విమర్శించారు.

Pawan Kalyan Comments on Universities
Pawan Kalyan Comments on Universities

By

Published : Dec 22, 2022, 6:13 PM IST

Pawan Kalyan Comments on Universities: విశ్వ విద్యాలయాలు విద్యార్థులను సామాజిక, రాజకీయ, ప్రాపంచిక విషయాలపై చైతన్యవంతులను చేయాలని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. రాష్ట్రంలోని ప్రఖ్యాత విశ్వ విద్యాలయాలు ఆ బాధ్యతను విస్మరించి అధికార పార్టీ కార్యకర్తలను తయారుచేసే పనిలో ఉన్నాయా అనే సందేహం కలుగుతోందన్నారు. విశ్వ విద్యాలయాలను అధికార పార్టీ కార్యాలయాలుగా మార్చేశారని విమర్శించారు.

తొమ్మిది దశాబ్దాలకు పైబడిన చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చోటు చేసుకున్న పరిణామాలు ఏ మేరకు ఆమోదయోగ్యమైనవని ప్రశ్నించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోనూ ఇదే పోకడ కనిపిస్తోందని విమర్శించారు. విశ్వవిద్యాలయ ఉపకులపతులకు ఆ పార్టీ పట్ల ప్రత్యేక ప్రేమ, ముఖ్యమంత్రిపై అనురాగం ఉంటే వాటిని ఇంటికి పరిమితం చేసుకుని బాధ్యతలు నిర్వర్తించాలని కోరారు. విశ్వ విద్యాలయాల ఖాతాల్లోని నిధులను ప్రభుత్వం మళ్లించుకోవడాన్ని నిలువరించి, విశ్వవిద్యాలయ అభివృద్ధి కోసం ఉపకులపతులు బాధ్యతగా పని చేయాలని పవన్‌కల్యాణ్‌ సూచించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details