తెలంగాణ

telangana

ETV Bharat / state

Pawan: చంద్రబాబు కంటతడి పెట్టడం బాధ కలిగించింది: పవన్ కల్యాణ్‌

చంద్రబాబు కంటతడి పెట్టడం బాధ కలిగించిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ అన్నారు. కుటుంబ సభ్యులను కించపరచటం తగదని వైకాపా నేతలను ఉద్దేశించి వ్యాఖ్యనించారు. వరదలతో రాష్ట్రం అతలాకుతలమవుతుంటే.. ఆ విషయం పట్టించుకోకుండా విమర్శించుకోవటం దురదృష్టకరమన్నారు. ఏపీ రాజకీయాలు ఆవేదన కలిగిస్తున్నాయని అన్నారు.

pawan kalyan
pawan kalyan

By

Published : Nov 19, 2021, 10:58 PM IST

ఏపీలో చోటుచేసుకుంటున్న రాజకీయ వైపరీత్యాలు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఓపక్క వరదలు... రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుంటే.. ప్రజా ప్రతినిధులు ఇవేమీ పట్టనట్టు ఆమోదయోగ్యంకాని విమర్శలు, వ్యాఖ్యలు చేయటం దురదృష్టకరమన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కంట తడి పెట్టడం బాధాకరమని పవన్ అన్నారు. ప్రతిపక్ష నేత కుటుంబసభ్యులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అత్యంత శోచనీయని విమర్శించారు. ఆడపడుచుల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు బాధ్యతాయుతమైన స్థానాల్లోని వ్యక్తులు మరింత జాగ్రత్త వహించాలని సూచించారు.

మహిళలను కించపరచడం, వారి గౌరవ ప్రతిష్ఠలకు హాని కలిగించడాన్ని జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తోందని పవన్​ అన్నారు. ఈ తరహా దిగజారుడు రాజకీయాలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇదే తరహా కొనసాగితే ఇది ఒక అంటు వ్యాధిలా అంతటా ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు సామాన్యులకు రాజకీయ వ్యవస్థపై ఏహ్యభావం కలిగించే ప్రమాదం ఉందన్నారు. ఇటీవల సభలు, సమావేశాలు, చివరికి టీవీ చర్చలలో కొన్నిసార్లు వాడుతున్న పదజాలం సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంటోందని పవన్ ఆవేదన చెందారు. ప్రజల దృష్టిలో రాజకీయ వ్యవస్థను పలుచనలు చేయవద్దని కోరారు.

జనసేన పత్రికా ప్రకటన

"తన భార్యను కించపరిచారని చంద్రబాబు కంటతడి పెట్టారు. చంద్రబాబు కంటతడి పెట్టడం బాధ కలిగించింది. కుటుంబ సభ్యులను కించపరచటం తగదు. రాష్ట్రంలోని రాజకీయాలు ఆవేదన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. వరదలను పట్టించుకోకుండా విమర్శించుకోవడం దురదృష్టకరం."- పవన్‌, జనసేన అధినేత

ఇదీ చూడండి:Chandrababu news today: ఇది గౌర‌వ స‌భా.. కౌరవ స‌భా: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details