తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రాణభయంతో.. ఛాంబర్ చుట్టూ తాడు కట్టించిన తహసీల్దార్..! - pattikonda mro umamaheshwari

కర్నూలు జిల్లా పత్తికొండ తహసీల్దార్ ఉమామహేశ్వరి తీసుకున్న నిర్ణయం.. అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తహసీల్దార్ విజయారెడ్డి హత్య ఘటనతో భయపడిన ఆమె.. ఇలా చేసి వార్తల్లో నిలిచారు.

pattikonda mro umamaheshwari

By

Published : Nov 6, 2019, 9:21 PM IST

పట్టపగలే మహిళా తహసీల్దార్ విజయారెడ్డి​ హత్యకు గురైన ఘటన నుంచి తెలుగు రాష్ట్రాల్లోని అధికారులు కోలుకోలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా పత్తికొండ తహసీల్దార్ ఉమామహేశ్వరి.. కార్యాలయంలోని తన ఛాంబర్‌ చుట్టూ తాడు కట్టుకున్నారు. కార్యాలయానికి వచ్చిన వారు దీనిని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఆర్జీలు ఇచ్చేవారు తాడు బయట నుంచే ఇవ్వాలని, ఎవరూ తాడు దాటి లోపలికి రాకుండా చూడాలని తన సిబ్బందిని ఆదేశించారు ఉమామహేశ్వరి. విజయారెడ్డికి హత్య తనను భయాందోళనకు గురి చేసిందని అన్నారు. ముందు జాగ్రత్త చర్యగా తాడుతో రక్షణ ఏర్పాటు చేసుకున్నానని బదులిచ్చారు.

ప్రాణభయంతో.. ఛాంబర్ చుట్టూ తాడు కట్టించిన తహసీల్దార్..!

ABOUT THE AUTHOR

...view details