బోరబండ రాజీవన్నగర్కు చెందిన స్వాతి(20)కి గురువారం రాత్రి 9 గంటల సమయంలో పురిటి నొప్పులు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు బోరబండ బస్టాప్ దగ్గరకు రాగా లాక్డౌన్ కారణంగా వాహనాలు ఏమీ లేవు. ఆ సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు వారికి సాయపడ్డారు.
పెట్రోలింగ్ వాహనంలో గర్భిణిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు - హైదరాబాద్ సిటీ వార్తలు
పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు సకాలంలో స్పందించి తల్లీ బిడ్డను కాపాడారు. పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భణిని పెట్రోలింగ్ వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్లి ఉదారతను చాటుకున్నారు. ఈఘటన ఎస్ఆర్నగర్ ఠాణా పరిధిలో జరిగింది.
![పెట్రోలింగ్ వాహనంలో గర్భిణిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు Telangana news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-06:16:43:1622767603-12007050-sr.jpg)
హైదరాబాద్ వార్తలు
మహిళను పెట్రోలింగ్ వాహనంలో నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. సకాలంలో ఆస్పత్రికి చేరడం వల్ల తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. కష్టకాలంలో ఆదుకున్న కానిస్టేబుల్ సాయి ప్రసాద్, హోంగార్డు శ్రావణ్‌కు.. స్వాతి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి:'ఉచిత బియ్యం నాణ్యతలో రాజీ పడొద్దు'