Patnam Mahender Reddy As Cabinet Minister : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ బీఆర్ఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే గులాబీ దళపతి ఒకే సారి 115 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిఎన్నికల సైరన్ మోగించారు. దాదాపుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే బెర్త్‌లు ఖారారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో చోటు దక్కని వారికి మరో రూపంలో అవకాశం ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ కీలక నిర్ణయాల్లో భాగంగా... రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణకు గులాబీ పార్టీ సిద్ధమవుతోంది.
Telangana Cabinet Expansion 2023 :గురువారం రోజున మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి వర్గంలో చోటు లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆరోగ్యశాఖ మంత్రి(Telangana Health Minister)గా గురువారం మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఒక ఖాళీ ఉంది. కేబినెట్ నుంచి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేసినప్పటి నుంచి ఆ ఖాళీ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ అంశాలు దృష్టిలో పెట్టుకొని ఆ ఖాళీని భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
BRS MLA Tickets Telangana 2023 : సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పెద్దపీట.. ఏడుగురు మహిళలకు ఛాన్స్
Health Ministry to Patnam Mahender Reddy : తాండూర్‌లో ప్రస్తుత ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి టికెట్ ప్రకటించినందున గతంలో అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయిన మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. అందుకు అనుగుణంగా కేబినెట్ విస్తరణ చేపట్టనున్నారు. నేడు ముఖ్యమంత్రికేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన (KCR Medak Tour) దృష్ట్యా గురువారం మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు సమాచారం. ఈమేరకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి రాజ్‌భవన్‌కి సమాచారం వెళ్లినట్లు తెలిసింది.