పార్లమెంటులో జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) బిల్లును ఆమోదించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర వైద్య సేవలు మినహా ఇతర సేవలు నిలిచిపోయాయి. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో వైద్యులు ఆందోళన బాట పట్టారు. దీని వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం వల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు ప్రత్యామ్నాయం చూపించాలని కోరుతున్నారు. వైద్యులు ఎప్పుడు అందుబాటులో వస్తారో తెలియక కొందరు ఆందోళన చెందుతుంటే... మరి కొందరు రేపు పరీక్షించుకోవచ్చనే ఉద్దేశంతో దగ్గర్లో వసతి చూసుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్న తమకు వైద్యుల సమ్మె మరింత వేదన కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
సమ్మెలో వైద్యులు... ఇబ్బందుల్లో రోగులు - రోగుల ఇక్కట్లు
ఎన్ఎంసీ బిల్లును వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైద్యుల సమ్మె దృష్ట్యా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు తిరిగి వైద్య సేవలు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలీక ఆందోళన చెందుతున్నారు.
బంద్‌లో వైద్యులు... ఇబ్బందుల్లో రోగులు