తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆస్పత్రుల నిర్లక్ష్యం... ప్రాణవాయువు లేదని చేతులెత్తేస్తున్నారు - telangana varthalu

కరోనా చికిత్సకు రూ.లక్షలు అడ్వాన్సుగా కట్టించుకుంటున్న కొన్ని ప్రైవేటు, కార్పొరేటు ఆసుపత్రులు ప్రాణవాయువు లేదంటూ చేతులెత్తేస్తున్నాయి. తాము ఆక్సిజన్‌ అందించినా గుండెపోటుతో మరణిస్తున్నారంటూ చెప్పి తప్పించుకుంటున్నాయి. కుటుంబీకులు గట్టిగా నిలదీస్తే, బకాయి బిల్లు ఇస్తేనే మృతదేహం అప్పగిస్తామంటూ చెబుతున్నారు.

patients died due to the doctors neglegency
ఆస్పత్రుల నిర్లక్ష్యం

By

Published : May 6, 2021, 4:18 PM IST

రోనా చికిత్సకు రూ.లక్షలు అడ్వాన్సుగా కట్టించుకుంటున్న కొన్ని ప్రైవేటు, కార్పొరేటు ఆసుపత్రులు ఆక్సిజన్​ లేదంటూ చేతులెత్తేస్తున్నాయి. తాము చికిత్స అందించినా మరణిస్తున్నారంటూ తప్పించుకుంటున్నాయి. కుటుంబీకులు గట్టిగా నిలదీస్తే, బకాయి బిల్లు ఇస్తేనే మృతదేహం అప్పగిస్తామంటూ చెబుతున్నారు. గతంలో అత్తాపూర్‌లోని ఓ ఆసుపత్రిలో ఓ బాధితుణ్ని వెంటిలేటర్‌ పడకలు లేవని బయటకు పంపారు. ఎస్సార్‌నగర్‌లోని ఓ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సరఫరా తగినంత లేక మూడు రోజుల్లోనే ఆరుగురు మరణించారు. సనత్‌నగర్‌లో ఉంటున్న ఓ యువకుడు గత నెల 21న తన తండ్రికి కరోనా వైరస్‌ సోకడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించాడు. నాలుగు రోజులయ్యాక సాధారణ వార్డుకు తెచ్చారు. 27న శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా అనిపించడంతో ఐసీయూలోకి మార్చారు. ఈలోగా ఆసుపత్రిలో ఆక్సిజన్‌ నిల్వలు అడుగంటాయి. ఐసీయూలో ఉన్న రోగులకు పరిమితంగా అందజేశారు. ఏప్రిల్‌ 28 అర్ధరాత్రికి కూడా నిల్వలు రాలేదు. దీంతో ఆరోగ్య పరిస్థితి కాస్త బాగున్న బాధితులకు కొద్దిసేపు ఆక్సిజన్‌ తీసేశారు. వారిలో ఈ యువకుడి తండ్రి ఒకరు. పరిస్థితి విషమించి 29వ తేదీ తెల్లవారుజామున మరణించారు.
చనిపోయినా బతికే ఉన్నాడని...
తండ్రి చనిపోయిన సమాచారాన్ని యువకుడికి ఆసుపత్రి వర్గాలు చెప్పలేదు. పరిస్థితి విషమించిందని, వెంటనే రావాలని చెప్పారు. వెళ్లగానే, వార్డు బయట నిల్చోమని చెప్పారు. ఏం జరుగుతోందనన్న ఆత్రుతతో అతను లోపలకు చూడగా... తండ్రి ఛాతీపై చేతులతో కొడుతూ కన్పించారు. ఆగ్రహంతో అతను లోపలికి తోసుకెళ్లి, తన తండ్రికి ఏమైందని నిలదీశారు. గుండె ఆగిపోయిందని, ఈ పద్ధతి ద్వారా పనిచేయించేందుకు యత్నిస్తున్నామని సమాధానమిచ్చారు. రెట్టించి అడగ్గా చనిపోయాడని తెలిపారు. ఉదయం 5.24 నిమిషాలకు మరణించినట్లు ధ్రువీకరణ పత్రం అందించారు.

ABOUT THE AUTHOR

...view details