Patient With Oxygen Cylinder Casted Vote Telangana 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. యువత, మహిళలతోపాటు వృద్ధులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు సైతం పోలింగ్ బూత్‌లకు వచ్చి తమ ఓటు వేసి అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఆక్సిజన్ సిలిండర్‌తో పోలింగ్ కేంద్రానికి - బతికున్నంత వరకు ఓటేస్తానంటున్న శేషయ్య - సిలిండర్‌తో వచ్చి ఓటు వేసిన వృద్ధుడు
Patient With Oxygen Cylinder Casted Vote Telangana 2023 : తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మహిళలు, వృద్ధులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందుకు వస్తున్నారు. కొంతమంది యువత మాత్రం ఓటింగ్‌లో పాల్గొనడానికి బద్ధకిస్తున్నారు. అలాంటి వారికి శేషయ్య ఆదర్శంగా నిలుస్తున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నా.. లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రానికి వచ్చి మరీ ఓటు వేశారు.
Published : Nov 30, 2023, 2:05 PM IST
Telangana Polling 2023 :హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నివాసం ఉంటున్న 75 ఏళ్ల శేషయ్య తీవ్రమైన లివర్ సిరోసిస్‌తో బాధపడుతున్నారు. అయినా సరే బతికున్నంత వరకు ఓటు వేయాలన్న పట్టుదలతో ఆయన ఆక్సిజన్ సిలిండర్‌తో పోలింగ్ కేంద్రానికి వచ్చారు. గచ్చిబౌలిలోలని జీపీఆర్ఏ క్వార్టర్స్‌లోని పోలింగ్ బూత్‌లో శేషయ్య తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఓటు వేయడం ఓ పౌరుడిగా తన బాధ్యత అని తెలిపారు. 1966 నుంచి తాను మిస్ అవ్వకుండా ఓటు వేస్తున్నానని చెప్పారు.