ఉస్మానియా ఆసుపత్రికి (Osmania Hospital) రోజురోజుకూ రోగుల రద్దీ(rush) పెరుగుతోంది. దీంతో దవాఖానాలో పడకలు దొరక్క వారంతా అగచాట్లు పడుతున్నారు. నిత్యం 1,600-1,800 మంది అవుట్ పేషెంట్లు (out patients) వివిధ చికిత్సల కోసం ఇక్కడికి వస్తుండగా.. వారిలో 200 మందికి మించి ఆసుపత్రిలో చేరుతున్నారు. అయితే వారందరికీ పడకలు మాత్రం లభించడం లేదు. దీంతో సుమారు 50-60 మందికి నిరీక్షణ తప్పడం లేదు. ఎవరైనా రోగి డిశ్ఛార్జి అయ్యాకే వారి బెడ్‌ను ఇతరులకు కేటాయిస్తున్నారు. లాక్‌డౌన్(lockdown) ఎత్తివేసిన తర్వాత రోగుల కష్టాలు మరింత ఎక్కువ అయ్యాయి. కొవిడ్ రెండో విడతలోనూ గాంధీ ఆసుపత్రిని(Gandhi hospital) కరోనా రోగుల కోసం కేటాయించిన సంగతి తెలిసిందే. దీంతో అన్నిరకాల సేవల కోసం ఉస్మానియాపైనే ఆధారపడుతున్నారు.
Osmania Hospital: పడక దొరికే వరకు... స్ట్రెచర్‌తో సర్దుకోవాల్సిందే! - ఉస్మానియా ఆసుపత్రిలో రోగుల ఆగచాట్లు
ఉస్మానియా ఆసుపత్రి (Osmania Hospital)పాత భవనానికి మరమ్మతులు చేయాలని గతంలోనే ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకు రూ.19 కోట్లు వరకు కేటాయించారు. అనంతరం ఈ ప్రతిపాదనలు కూడా వెనక్కి వెళ్లిపోయాయి. సమస్యకు పరిష్కారం లభించక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాత భవనం స్థానంలో కొత్తదాన్ని నిర్మించడం లేదంటే... వేరేచోట నూతనంగా ఉస్మానియా ఆసుపత్రిని ఏర్పాటు చేయడం ఒక్కటే పరిష్కారమని అధికారులు చెబుతున్నారు.
![Osmania Hospital: పడక దొరికే వరకు... స్ట్రెచర్‌తో సర్దుకోవాల్సిందే! Osmania Hospital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12440773-thumbnail-3x2-kee.jpg)
వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో డెంగీ, మలేరియా, డయేరియా (Dengue, malaria, diarrhea) లాంటి వ్యాధులు పెరగడంతో మరింత రద్దీ ఏర్పడింది. కొన్నిసార్లు ఓపీ చీటీలు తీసుకునే కౌంటర్ల వద్ద రోగుల మధ్య తోపులాట చోటుచేసుకుంటోంది. ఇక రక్తపరీక్షలు, ఎక్స్‌రే, 2డీ ఈకో పరీక్షల కోసం గంటలపాటు వేచి చూడాల్సి వస్తోందని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాంధీ దవాఖానాలో బ్లాక్‌ఫంగస్ (black fungus) చికిత్స సహా కరోనా రోగులు కలిపి 450 మంది ప్రస్తుతం వైద్యసేవలు పొందుతున్నారు. నిత్యం 10-15 మంది వరకు బ్లాక్‌ఫంగస్ బాధితులు.. మరో 20 మంది వరకు కొవిడ్ రోగులు చేరుతున్నారు. ఈ కేసులు కనిష్ఠానికి తగ్గితే తప్పా... గాంధీలో ఇతర సేవలు ప్రారంభించే అవకాశం లేదని అక్కడి వైద్యసిబ్బంది చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా ఒక్కటే దిక్కు కావడంతో ఇక్కడ విపరీతమైన రద్దీ నెలకొంటోంది.
ఎందుకిలా..
- గతేడాది వరదల కారణంగా ఉస్మానియాలో పాత భవనం మూసివేశారు. ఇందులో 500 పడకలు, 3 ఆపరేషన్ థియేటర్లు ఉండేవి. ఈ పడకలను కులీకుతుబ్‌షా భవనంలోని పై అంతస్తులో సర్దుబాటు చేశారు. ప్రస్తుతమిక్కడ 120-150 పడకలు వరకు మాత్రమే సర్దుబాటు చేయగలిగారు. ఆపరేషన్ థియేటర్లను మాత్రం వేరేచోట కొత్తగా ఏర్పాటు చేశారు. తాజాగా ఈ థియేటర్లను అందుబాటులోకి తేవడంతో శస్త్రచికిత్సల(operations) కోసం నిరీక్షించే సమయం తప్పింది. అయితే ఆపరేషన్ చేయాలంటే తొలుత రోగికి పడక కేటాయించడం ముఖ్యం. స్థలాభావం వల్ల బెడ్లు ఇవ్వడం కష్టమవుతోందని అధికారులు చెబుతున్నారు. అత్యవసర సమయంలో వచ్చే రోగులను పడక దొరికే వరకు స్ట్రెచర్‌పై పడుకోబెడుతున్నారు. మరికొందరు రోగులను నేలపైనే పరుపు వేసి అక్కడ చికిత్సలు చేస్తున్నారు.
- పాత భవనం స్థానంలో కొత్తది నిర్మించాలని ఇప్పటికే వైద్యులు, ప్రజా సంఘాల నేతలు పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా హైకోర్టు కూడా పాత భవనం విషయమై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పాత భవనం కూల్చివేసి కొత్తది నిర్మించాలంటే పురావస్తు శాఖ నిబంధనలు అడ్డంకిగా మారాయి. దోబీఘాట్ సమీపంలో కొంత స్థలం ఉన్నప్పటికీ భారీ భవనాలు నిర్మించేందుకు అక్కడి జాగా సరిపోదు. పక్కనే మూసీ నది ఉండటంతో లోతుగా సెల్లార్ తవ్వడం కష్టమేనని నిపుణులు అంటున్నారు.
- ఇదీ చదవండి :Kaushik Reddy: '50 కోట్లు ఇచ్చి రేవంత్ అధ్యక్షుడయ్యాడు.. ఆరునెలల్లో కాంగ్రెస్ ఖాళీ!'