గుండె జబ్బుతో వచ్చిన వ్యక్తికి సరైన వైద్యం అందక మెదడు వాపు వ్యాధితో మృతి చెందడానికి కారణం వైద్యులే అని హైదరాబాద్లో ఓ ప్రైవేటు ఆసుపత్రి ముందు మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వారం రోజుల క్రితం ఆస్పత్రిలో గుండె సంబంధిత వ్యాధితో అడ్మిట్ అయిన రవి అనే యువకుడిని వైద్యులు పట్టించుకోలేదని అందువల్లే అతడు మరణించాడని తమకు సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గుండె సంబంధిత వ్యాధితో వచ్చిన రవికి బ్రెయిన్ స్ట్రోక్ రావడం అనేది అసాధ్యమని వారి కుటుంబ సభ్యులు అంటున్నారు. కన్న కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆపేదిలేదని స్పష్టం చేశారు.
గుండెకు ఆపరేషన్ చేస్తే... మెదడు వాపు వ్యాధితో మృతా!! - మెదడు వాపు వ్యాధి
గుండె జబ్బుతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరితే గుండెకు ఆపరేషన్ చేశారు. తీరా చూస్తే మెదడు వాపు వ్యాధి అని తేల్చారు. మృతి చెందాక కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఒక్క బిల్లు పేపరూ ఇవ్వలేదు. సరైన వైద్యం చేయలేదంటూ వైద్యులు పట్టించుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని ఆసుపత్రి ముందు మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు.
వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కొడుకు మృతి చెందాడు : తల్లిదండ్రులు