ETV Bharat / state
వైద్యుల నిర్లక్ష్యమే మృతికి కారణం..! - doctors
ప్రభుత్వ వైద్యశాలలో సిబ్బంది విధులను నిర్లక్ష్యం చేస్తుండటం వల్ల రోగులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూతో ఓ వ్యక్తి చనిపోయాడు.
స్వైన్‌ఫ్లూతో ఓ వ్యక్తి మృతి
By
Published : Feb 13, 2019, 7:05 AM IST
| Updated : Feb 13, 2019, 9:28 AM IST
స్వైన్‌ఫ్లూతో ఓ వ్యక్తి మృతి ప్రజారోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం దవాఖానాలను బలోపేతం చేస్తోంటే, కొందరు వైద్యులకు మాత్రం నిర్లక్ష్యపు రోగం పట్టుకుంది. హైదరాబాద్ ఉప్పల్‌కు చెందిన హరినాథ్ రెడ్డికి స్వైన్ ఫ్లూ సోకింది. గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్తే వైద్యులు, సిబ్బంది పట్టనట్లు వ్యవహరించారని.. సకాలంలో వైద్యం అందక హరినాథ్ మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. గాంధీ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ సోదరుడు మృతి చెందాడని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుని బంధువు డిమాండ్ చేశారు. Last Updated : Feb 13, 2019, 9:28 AM IST