రాష్ట్రంలో లాక్‌డౌన్ సమయాలను పొడిగించడంతో పాస్‌పోర్టు సేవలు యథాతథంగా రేపటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. ప్రధానంగా లాక్‌డౌన్ సమయంలో ఆగిన 14తపాలా కార్యాలయాల్లో పాస్‌పోర్టు సేవలు పునరుద్దరిస్తున్నట్లు సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి బాలయ్య తెలిపారు. రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతుండడంతో నివారణ చర్యల్లో భాగంగా గత నెల 12 నుంచి లాక్‌డౌన్ అమలులోకి వచ్చింది.
ఆరోజు నుంచి రాష్ట్రంలో పూర్తిగా పాస్‌పోర్టు సేవలు ఆగిపోయాయి. అత్యవసరంగా విదేశాలకు వెళ్లే వారి కోసం లాక్‌డౌన్ సమయంలో సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ద్వారా సేవలు అందుబాటులోకి వచ్చాయి. లాక్‌డౌన్ సడలింపు సమయాలను పొడిగించడంతో ఈ నెల 1 నుంచి రాష్ట్రంలోని 5 పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో పాస్‌పోర్టు సేవలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పునరుద్దరించారు.