రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలులో ఉన్నందున ఈ నెల 21 వరకు పాస్‌పోర్టు సేవా కేంద్రాలు పని చేయవని సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి బాలయ్య తెలిపారు. అత్యవసర ప్రయాణం చేయాల్సిన వారి కోసం సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయంలో దరఖాస్తుల ప్రాసెసింగ్ కౌంటర్ పని చేస్తుందని వెల్లడించారు. ఈ నెల 17 నుంచి 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు.
'ఈ నెల 21 వరకు పాస్‌పోర్టు సేవా కేంద్రాలు పని చేయవు' - Passport service centers will not be operational
ఈ నెల 21 వరకు పాస్‌పోర్టు సేవా కేంద్రాలు పని చేయవని సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి బాలయ్య తెలిపారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
!['ఈ నెల 21 వరకు పాస్‌పోర్టు సేవా కేంద్రాలు పని చేయవు' passport services](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11762625-338-11762625-1621008056055.jpg)
passport services
లాక్‌డౌన్ అమలులో ఉన్న సమయంలో సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం సాధారణ రోజుల మాదిరిగానే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పని చేస్తుందని తెలిపారు. ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసిన వారు.. అత్యవసర ప్రయాణానికి సంబంధించిన పత్రాలతో అన్ని ఒరిజినల్స్ తీసుకుని, దరఖాస్తు రెఫరెన్స్ నంబరుతో సంప్రదించాలని ఆయన వివరించారు.
ఇదీ చూడండి: అంబులెన్సులను ప్రభుత్వం ఏ రకంగానూ అడ్డుకోవద్దు: హైకోర్టు
TAGGED:
తెలంగాణ తాజా వార్తలు