రాష్ట్రంలో లాక్‌డౌన్ పది రోజులు పొడిగించినందున సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయ ప్రాంగణంలో పాస్‌పోర్ట్ ప్రాసెసింగ్ కౌంటర్ (Passport processing counter) అన్ని పనిదినాల్లో పని చేస్తుందని ఆర్పీఓ దాసరి బాలయ్య తెలిపారు. జూన్ 9 వరకు లాక్‌డౌన్ అమలులో ఉంటున్నందున అన్ని పని దినాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు.
Passport: అన్ని పనిదినాల్లో పనిచేయనున్న పాస్ పోర్టు కార్యాలయం - Passport processing counter news
లాక్‌డౌన్ పది రోజులు పొడిగించినందున సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయ ప్రాంగణంలో పాస్‌పోర్ట్ ప్రాసెసింగ్ కౌంటర్ అన్ని పనిదినాల్లో పని చేస్తుందని ఆర్పీఓ దాసరి బాలయ్య తెలిపారు.
![Passport: అన్ని పనిదినాల్లో పనిచేయనున్న పాస్ పోర్టు కార్యాలయం hpur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-09:40:15:1622391015-11958642-ppp.jpg)
hour
విదేశాలకు అత్యవసర ప్రయాణాలు చేయదలిచిన వారి కోసం ఈ ప్రత్యేక కౌంటర్ పని చేస్తుందని ఆయన తెలిపారు. మే 12 నుంచి రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు అవుతుండడంతో ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని పాస్‌పోర్టు సేవా కేంద్రాలు పాస్ పోర్టుల జారీ ప్రక్రియను నిలిపివేసిన విషయాన్ని గుర్తు చేశారు.