తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్సుల్లో సీట్ల కోసం పోరాటం.. మరిచారు సామాజిక దూరం.. - passengers rush in hyderabad busstands due to dusshera

కరోనా వ్యాప్తితో ప్రయాణీకులు లేక వెలవెల బోయిన బస్సులు, ప్రైవేటు వాహనాలు ఇప్పుడు కిటకిటలాడుతున్నాయి. దసరా పండుగ నేపథ్యంలో నగర వాసులు సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఈ సమయంలో కరోనా విపత్కర పరిస్థితుల దృష్ట్యా దూర ప్రయాణాలు చేసే ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ప్రయాణీకుల రద్దీ చూస్తే మహమ్మారి పట్ల ప్రజలు ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో ప్రస్ఫుటమవుతుంది.

passengers rush in hyderabad busstands due to dusshera
తగ్గిన భయం.. పెరిగిన రద్దీ.. మళ్లీ విజృంభించేనా?

By

Published : Oct 24, 2020, 8:05 AM IST

దసరా పండుగ దృష్ట్యా హైదరాబాద్​లోని బస్టాండ్లలో సందడి నెలకొంది. నిన్న మొన్నటి వరకు కొద్దిమంది ప్రయాణికులతో అరకొరగా తిరిగిన బస్సులు ఇప్పుడు జనాలతో కిక్కిరిసి పోతున్నాయి. కొవిడ్​ వ్యాప్తి కారణంతో ఎవరి ఇళ్లకు వారే పరిమితమైన వారు ఇప్పుడు పండుగ రాకతో సొంతూళ్లకు పయనమవుతున్నారు.

సీట్ల కోసం ఇక్కట్లు

ఈ సమయంలో బస్సుల్లో, ప్రైవేటు వాహనాల్లో రద్దీతో కరోనా వ్యాప్తి అధికమయ్యే అవకాశం లేకపోలేదు. మాస్కులు ధరించి ప్రయాణించినా కనీస జాగ్రత్తలు, భౌతిక దూరం పాటించకపోతే మహమ్మారి విజృంభించే అవకాశాలు ఉన్నాయి. నగరంలోని ఉప్పల్​ బస్టాండ్​లో తాజా పరిస్థితులు చూస్తే కొవిడ్​ పట్ల జనం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమవుతుంది.

ఉప్పల్​ బస్టాండ్​లో ప్రైవేటు వాహనాల జోరు
ప్రైవేటు వాహనంలో పాటించని భౌతిక దూరం

ఇదీ చదవండి:ఇది రైతులు, కాంగ్రెస్​ పార్టీ విజయం: ఉత్తమ్

ABOUT THE AUTHOR

...view details