మిగతా రవాణా సాధనాలకంటే మెట్రో సౌకర్యానికి ప్రయాణికులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. మెట్రోలో ఎక్కువగా కరోనా నివారణ చర్యలు తీసుకోవడం... మాస్క్ లేకుంటే ప్రయాణికులను అనుమతించకపోవడం తదితర భద్రత చర్యలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ప్రయాణ సమయంలో రైలులో వ్యక్తికి వ్యక్తి మధ్య దూరం పాటించేలా చర్యలు తీసుకోవడం.. స్టేషన్ పరిసరాల్లో శానిటైజేషన్, థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేసి అనుమతించడం వంటి చర్యలు తీసుకున్నారు. ప్రయాణ సమయంలో రైలులోను, స్టేషన్లోను కరోనా రక్షణ నిబంధనల గురించి అన్ని భాషల్లో ప్రచారం చేస్తున్నారు.
ఆకట్టుకునే ఆఫర్లతో..
పండుగల సందర్భంగా మెట్రో... ప్రయాణీకులకోసం ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ట్రిప్పుల ప్రకారం, క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో ఆకట్టుకుంటోంది. దీనివల్ల ప్రయాణీకుల సంఖ్య పెరుగుతోంది.