తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్సు ఎక్కాలంటే గుబులే! - బస్సులో ప్రయాణించేందుకు భయపడుతున్న ప్రయాణికులు

‌ప్రయాణమంటే ప్రజల్లో గుబులు నెలకొంది. తప్పనిసరైతేనే బస్సు ఎక్కడానికి సిద్ధమవుతున్నారు. అధిక శాతం శుభకార్యాలు వాయిదా వేసుకుంటున్నారు.. ఇందుకు కారణం కరోనా. దేశవ్యాప్తంగా భారీగా కేసులు నమోదవుతుండటంతో జనం ఆందోళన చెందుతున్నారు. బస్సుల్లో ప్రయాణించేందుకు వెనకాడుతున్నారు.

passangers fearing to travel in busses
బస్సు ఎక్కాలంటే గుబులే!

By

Published : Jun 7, 2020, 5:47 AM IST

కొవిడ్‌ నేపథ్యంలో బస్సుల్లో శానిటైజర్లను ఏర్పాటు చేశారు. మాస్క్‌ ఉంటేనే అనుమతించాలని నిర్ణయించారు. అయినా ప్రజలకు ప్రయాణాలపై విశ్వాసం పెరగడంలేదు. ఆర్టీసీ ప్రస్తుతం సగటున 4,500 నుంచి 4,900 వాహనాలను నడుపుతోంది. హైదరాబాద్‌లో సిటీ సర్వీసులను ఇంకా నడపడంలేదు. అంతర్‌ రాష్ట్ర సర్వీసులు నడిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఏపీఎస్‌ఆర్టీసీ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం మరికొద్ది రోజులు వేచి చూడాలని నిర్ణయించింది. ఆర్టీసీ ఆక్యుపెన్సీ సగానికి పైగా తగ్గి 35.37 శాతంగా నమోదైంది. కరోనా తీవ్రతకు ముందు అది 74 నుంచి 76 శాతం ఉండేది.

ప్రయాణికులు లేక వెలవెలబోతున్న జూబ్లీ బస్ స్టేషన్

రోజుకు సుమారు రూ.12 కోట్లు వచ్చే ఆదాయం రూ.3.50 కోట్లకు తగ్గిపోయింది. గత నెల 19 నుంచి ఆర్టీసీ బస్సులను పునఃప్రారంభించింది. తొలిరోజుల్లో 28 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. అనంతరం కొద్దిగా పుంజుకుంది.

బస్సు ఎక్కాలంటే గుబులే!

త్వరలో పూర్వవైభవం
ప్రయాణానికి ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఒకట్రెండు నెలలు ఇలానే ఉంటుందని అంచనా వేస్తున్నాం. ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు దూర ప్రాంతాలకు బస్సులు నడపటం లేదు. ఆక్యుపెన్సీ, ఆదాయం తగ్గడానికి అది కూడా ఒక కారణం. సాధారణ పరిస్థితుల్లో ఇది శుభకార్యాల సమయం. మంచి ఆదాయం లభించే సీజన్‌. కరోనాకు భయపడి కొందరు శుభకార్యాలను వాయిదా వేసుకుంటే మరికొందరు పరిమిత సంఖ్యలో అతిథులను ఆహ్వానిస్తున్నారు. త్వరలో ఆర్టీసీకి పూర్వవైభవం వస్తుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:రాష్ట్రంలో ఈరోజు 206 మందికి కరోనా

ABOUT THE AUTHOR

...view details