తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ రైల్లో ప్రయాణించాలంటే ముక్కు మూసుకోవాల్సిందే..!

Passengers Faced Water Problem in Train: ఏపీలోని కాకినాడ నుంచి బయల్దేరిన రైలులో సౌకర్యాలు లేక ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల తాము ఇబ్బంది పడాల్సి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

kakinada visakhapatnam express
kakinada visakhapatnam express

By

Published : Feb 4, 2023, 3:49 PM IST

Passengers Faced Water Problem in Train: రైలు ప్రయాణం అంటే గంటల తరబడి రైలులోనే కూర్చోని ప్రయాణించాల్సి ఉంటుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లడానికి ప్రయాణికులు రైలు మార్గాన్ని ఎంచుకుంటారు. రోడ్డు మార్గం కన్నా.. రైలు మార్గం సౌకర్యవంతంగా ఉంటుందని రైళ్లలో ప్రయాణించటానికి ప్రజలు మొగ్గుచూపుతారు. అయితే ఆంధ్రప్రదేశ్​లోని కాకినాడ నుంచి బయల్దేరిన కాకినాడ - విశాఖపట్నం రైలులో మాత్రం ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. ప్రయాణ సమయంలో ట్రైన్​లో సరైన సౌకర్యాలు లేకపోవటంతో నరకయాతను అనుభవించారు.

కాకినాడ - విశాఖపట్నం ఎక్స్​ప్రెస్​ శనివారం ఉదయం కాకినాడ నుంచి బయల్దేరింది. అయితే రైలు సరైన టైమ్​కు అటో ఇటో నడుస్తున్న పట్టించుకొని ప్రయాణికులు.. రైలులో నీళ్లు రాకపోవటంతో నానా అవస్థలు పడ్డారు. చేతులు శుభ్రం చేసుకోవటానికి వాష్​ బేసిన్​లో నీళ్లు రాలేదని.. అలాగే మరుగుదొడ్లలో సైతం నీరు రావడం లేదని.. తద్వారా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నామని ప్రయాణికులు వాపోయారు. రైలు మొత్తం ఇదే పరిస్థితి ఉందని.. ఏ బోగిలో నీళ్లు రావటం లేదని తెలిపారు. రోజు వెళ్లే ప్రయాణికులు మాత్రం అప్పుడప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందని అంటున్నారు. దుర్వాసన భరించలేని విధంగా ఉందని పేర్కొన్నారు. అధికారులు ఈ విధంగా నిర్లక్ష్యం వహించటం తగదని వారు మండిపడ్డారు.

ఇది రైలు ప్రయాణం కాదు.. నరకయాతనే: ప్రయాణికులు

ABOUT THE AUTHOR

...view details