ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో.. వైకాపాకు 52.63 శాతం ఓటింగ్ - ap latest news
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో.. 52.63 శాతం ఓటింగ్‌ను.. అధికార పార్టీ వైకాపా దక్కించుకుంది. తర్వాత స్థానాల్లో తెదేపా, జనసేన, భాజపా నిలిచాయి.
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో.. వైకాపాకు 52.63 శాతం ఓటింగ్
ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీ ఎంత శాతం ఓటింగ్ సాధించిందన్న వివరాలపై స్పష్టత వచ్చింది. మెజారిటీ స్థానాలు కైవసం చేసుకున్న వైకాపా.. 52.63 శాతం ఓటింగ్ దక్కించుకుంది. తర్వాతి స్థానాల్లో నిలిచిన తెదేపాకు 30.73 శాతం.. జనసేనకు 4.67 శాతం.. భాజపాకు 2.41 శాతం.. స్వతంత్రులకు 5.73 శాతం.. నోటాకు 1.07 శాతం ఓటింగ్ నమోదైంది.
పార్టీ | ఓటింగ్ శాతం |
వైకాపా | 52.63 |
తెదేపా | 30.73 |
జనసేన | 4.67 |
భాజపా | 2.41 |
స్వతంత్రులు | 5.73 |
నోటా | 1.07 |