మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్ర పూర్తి చేసుకుని తొలిసారిగా భాజపా రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు (Bandi Sanjay) పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలతో, బాణాసంచా కాల్చి.. సంతోషం వ్యక్తం చేశారు.భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బండి సంజయ్ (Bandi Sanjay) పాల్గొన్నారు. మొదటివిడత పాదయాత్ర, హుజూరాబాద్ ఉపఎన్నికకు సంబంధించిన అంశాలపై భేటీలో చర్చించారు.
అనంతరం ఎల్బీనగర్లోని శుభం గార్డెన్లో 'వెన్నంటే ఉండి కొండంత బలాన్నిచ్చిన అంకితభావానికి ఆత్మీయ సత్కారం' అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. భాజపా చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మొదటి దశ... విజయవంతంగా పూర్తయిన సందర్భంగా యాత్రలో పూర్తి సమయం కేటాయించిన వారందరిని సన్మానించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో వివిధ విభాగాలలో పాల్గొని పనిచేసిన వారందరిని సన్మానించి... వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఇదే ఉత్సాహంతో ప్రతి ఒక్కరూ పనిచేసి 2023లో భాజపా ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు.