Party Jumpings in Telangana Elections :రాజకీయాల్లో నేతలు ఎన్ని పార్టీలు మార్చినా.. అసలు సిసలైన అభిమానులు, కార్యకర్తలు మాత్రం ఒకే జెండాకు జై కొడుతుంటారు. వాళ్ల ఆత్మాభిమానం దెబ్బతిన్నప్పుడు.. ఇబ్బందికర పరిస్థితి తలెత్తినపుడు మాత్రమే ఇతర పార్టీ వైపు మొగ్గుచూపుతారు. తమ నాయకుల బాటలో నడుస్తారు. స్వలాభం కోసం నాయకులు పదే పదే పార్టీలు మారుతుంటే మాత్రం వీళ్లంతా ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోతుంటారు. ప్రస్తుతం నగరంలోని పలు శాసనసభ నియోజకవర్గాల్లో ఇలాంటి వాతావరణమే కనిపిస్తోంది. గెలుపోటములను ప్రభావితం చేసే వీరి ఓట్లు ఎవరికి పడతాయనేది ఇప్పుడు అభ్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిసోంది. ఇన్నాళ్లు తమ వెంట ఉన్న వాళ్లకు ఓటు వేస్తారా.. లేక నమ్ముకున్న పార్టీకి వేస్తారా అన్న ప్రశ్న అందరిలో మొదలైంది.
చివరి వారమంతా తెలంగాణలోనే అగ్రనేతలు - ఆఖరి ఘట్టంలో ప్రచారాన్ని హోరెత్తించనున్న ప్రధాన పార్టీలు
జూబ్లీహిల్స్ పరిధిలో నామినేషన్ల పర్వం తర్వాత ప్రధాన పార్టీ నాయకుడు ప్రత్యర్థి పార్టీలోకి చేరారు. ఆయనతోపాటు సుమారు 200 మంది కీలక అనుచరులు కార్యకర్తలు కండువాలు కప్పుకొన్నారు. రోజుల వ్యవధిలోనే నాయకుడు మరో పార్టీకి జై కొట్టడంతో అతని అనుచరులు ఆలోచనలో పడ్డారు. కొందరు దీనికి మౌనం వహిస్తే.. మరికొందరు సారీ అన్నా అంటు నాయకుడి నుంచి దూరం జరిగారు.
అదేనియోజకవర్గపరిధిలోని ద్వితీయశ్రేణి నాయకులు తమ పార్టీ వ్యవహారశైలి నచ్చకపోవడంతో పక్క పార్టీకి మద్ధతు పలుకుతున్నట్లు తెలిపారు. వారంతా ఎవరు నచ్చక పార్టీ మారారో.. ఆ నేత కూడా అదే పార్టీలోకి రావడం వల్ల వారికి ఏం చేయాలో పాలుపోకుండా ఉందంటూ రెహ్మత్నగర్కు చెందిన చోటా నాయకుడు అవేదన వ్యక్తం చేశారు. ఇలా స్వలాభం కోసం పార్టీ మారుతున్న నేతల వల్ల అనుచరులు గందరగోళానికి గురవుతున్నారు.
జోరందుకున్న కాంగ్రెస్ ప్రచారం - ఆ 18 నియోజకవర్గాలపైనే ప్రధాన ఫోకస్