దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలలో ఫిరాయింపులు పెరిగి పోతున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. అధికారం కోసం భాజపా అడ్డదారులు తొక్కుతోందని విమర్శించారు. ఇంటర్ విద్యార్థుల మృతి అంశాన్ని పక్కదారి పట్టించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సచివాలయం, అసెంబ్లీల నిర్మాణాలు తెరపైకి తెచ్చారన్నారు. అప్పులతో ఉన్న రాష్ట్రంలో నూతన నిర్మాణాలు చేపట్టడం తప్పుడు నిర్ణయమని కేసీఆర్ పై ధ్వజమెత్తారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానన్న హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకోవాలని కోరారు. తహశీల్దారుల బదిలీలు చేపట్టకుండా అధికార అహంతో, ముఖ్యమంత్రి మొండిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెరాస వైఫల్యాలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ నెల 12న రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు చాడ తెలిపారు.
పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యానికి చేటు: చాడ
పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యానికి చేటు: చాడ