గ్రేటర్ పరిధిలో ఈనెల 29న సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్ ముగిసే వరకు మద్యం షాపులు మూసివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 4 కౌంటింగ్ రోజు కూడా గ్రేటర్ పరిధిలో మద్యం దుకాణాలు మూసి ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో పార్థసారథి సమీక్ష నిర్వహించారు.
ఎన్నికల నేపథ్యంలో మద్యం విక్రయాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని... మద్యం తయారీ, రవాణా నిల్వలు, దుకాణాలు తెరిచి ఉంచే సమయాలపై నిఘా పెట్టాలని సూచించారు. అనధికార బెల్ట్ దుకాణాలు వెంటనే మూసివేయాలని... గతేడాది సమయంలో జరిగిన మద్యం ఉత్పత్తులు, అమ్మకాలతో బేరీజు వేస్తూ పర్యవేక్షించాలన్నారు.