తెలంగాణ

telangana

ETV Bharat / state

గేటు విరిగిపడి కాపలాదారు మృతి - hyderabad

పార్కులో విధులు నిర్వహిస్తున్న కాపలాదారుపై గేటు విరిగిపడి మృతి చెందిన విషాద ఘటన  హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్​లో చోటుచేసుకుంది. మృతుని కుటుంబాన్ని ఆదుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.

గేటు విరిగిపడి కాపలాదారు మృతి

By

Published : Aug 12, 2019, 3:18 AM IST

Updated : Aug 12, 2019, 7:02 AM IST

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరి పార్కులో విధులు నిర్వహిస్తున్న రాములు అనే కాపలాదారుపై... పార్కు గేటు విరిగిపడింది.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతను మృతి చెందాడు. జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తూ రాములు బంధువులు ఆందోళనకు దిగారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వెంకటగిరి పార్కులో గతంలో కూడా ఈ తరహా ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. అయిన్నపటికీ అధికారులు గేటుకు మరమ్మత్తులు చేయించలేదని వివరించారు. ఈ కారణంగానే అకస్మాత్తుగా గేటు విరిగిపడి కాపలాదారుడు మృతి చెందాడన్నారు. రాములు కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు డిమాండ్‌ చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న జీహెచ్‌ఎంసీ డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాసులు రాములు కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

గేటు విరిగిపడి కాపలాదారు మృతి
Last Updated : Aug 12, 2019, 7:02 AM IST

ABOUT THE AUTHOR

...view details