తెలంగాణ

telangana

ETV Bharat / state

కొలిక్కిరాని తొమ్మిదేళ్ల పాప మృతి కేసు - తెలంగాణ తాజా వార్తలు

హైదరాబాద్‌ ఐఎస్ ​సదన్‌లో ఈనెల 23న తొమ్మిదేళ్ల పాప అనుమానాస్పద మృతిపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పట్ల పాప తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలువురిపై అనుమానాలు ఉన్నాయని... క్లూస్ టీం తీసుకువచ్చిన కుక్కలు కూడా ఫలానా ఇంటికి వెళ్లాయని చెప్పినా పట్టించుకోవట్లేదని.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.

hyderabad news, crime news
IS SADAN, girl murder case

By

Published : Mar 31, 2021, 9:48 AM IST

హైదరాబాద్‌లో ఈనెల 23న జరిగిన తొమ్మిదేళ్ల పాప అనుమానాస్పద మృతి కేసుపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈనెల 23న దంపతులు నేనావత్‌ సేవ్య, జ్యోతి తమ ముగ్గురు పిల్లలను ఇంట్లో ఉంచి రోజూవారీ కూలీ పనులకు వెళ్లారు. మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చే సరికి పెద్ద కుమార్తె శ్రీనిధి చనిపోయి ఉంది. పాప తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. చిన్నారి మృతిచెంది వారం గడుస్తున్నా... పాప ఎలా మృతిచెందింది అనేది పోలీసులు చెప్పడంలేదని వాపోతున్నారు. చిన్న దొంగతనం జరిగితేనే సాంకేతిక ఆధారాలు, ప్రచార సాధనాలు అంటూ హడావుడి చేసే పోలీసులు.. తమ పాప కేసులో చిన్న విషయం అంటూ దాటేస్తున్నారని వాపోయారు.

పోలీసులు ఏమంటున్నారంటే..

ఆటలో భాగంగా... పాప తాడును మెడకు బిగించుకుందని... ఉరి పడటంతో మృతిచెందిందని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని చెబుతున్నారు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:యువతి కిడ్నాప్​.. 'బలవంతంగా బైక్​పై ఎక్కించుకెళ్లారు'

ABOUT THE AUTHOR

...view details