పంజాగుట్టలో అగ్నిప్రమాదం ప్రాణాలకు తెగించి కుటుంబాన్ని కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ Panjagutta Fire Accident Today :ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న బహుళ అంతస్తుల భవనం అది. ఉదయం సమయంలో ఒక్కసారిగా ఆరో అంతస్తులో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారు. మంటలు చూసి వారంతా భయబ్రాంతులకు గురయ్యారు. రక్షించమంటూ కేకలు వేశారు. భవనం బయట ఉన్న వారంతా ఏం జరుగుతుందోనని ఆందోళనకు లోనయ్యారు.
భద్రాచలంలోని పాత ఎంపీడీవో కార్యాలయంలో అగ్నిప్రమాదం - కాలి బూడిదైన కీలక దస్త్రాలు
అగ్నిప్రమాదం కారణంగా ఇంట్లోని గృహోపకరణాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ఈ ఘటన జరిగిందని అధికారులు భావిస్తున్నారు. అప్పటికే అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న పంజాగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రావణ్‌కుమార్, ఘటనాస్థలానికి చేరుకున్నాడు. భవనం వద్దకు చేరుకున్న ఆయన, పొగలు అలుముకున్న ఆరో అంతస్తు వద్దకు వెళ్లాడు. పరిస్థితులను అర్ధం చేసుకుని వెంటనే మంటలు చెలరేగిన ఇంటి తలుపులు బద్దలు గొట్టాడు.
Fire Accident in Hyderabad :అప్పటికే దట్టమైన పొగలు, మంటల కారణంగా ఊపిరి తీసుకోలేక ఇబ్బంది పడుతున్న ఐదుగురిని ఇంటి నుంచి బయటకు తీసుకువచ్చాడు. ఈ దృశ్యాన్ని చూసిన అక్కడున్న వారంతా కానిస్టేబుల్‌ను అభినందనలతో ముంచెత్తారు. క్షేమంగా బయటపడిని వారిని చూసి ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.
నాంపల్లిలోని బజార్ ఘాట్‌లో అగ్నిప్రమాదం- మంటల్లో చిక్కుకుని 9 మంది కార్మికులు మృతి
Traffic Constable Rescued A Family in Hyderabad : అయితే కానిస్టేబుల్ శ్రావణ్‌కుమార్ (Traffic Constable Shravan Kumar) గతంలో కూడా పంజాగుట్ట ప్రాంతంలోని నాగార్జున సర్కిల్ వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో ఇంట్లో చిక్కుకున్న వృద్ధురాలు, ఆమె మనవరాలిని సురక్షితంగా కాపాడాడు. మంటల్లో చిక్కుకున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని కాపాడిన కానిస్టేబుల్ ఎందిరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. పోలీసు ఉన్నతాధికారులు అతన్ని ప్రశంసించారు.
"అగ్నిప్రమాదం జరిగిందని పోలీస్‌స్టేషన్ నుంచి సమాచారం వచ్చింది. ఆరో అంతస్తులో ఉన్నవారిని కాపాడడానికి మరో ఇద్దరు సహాయం చేశారు. వెంటనే వారికి బయటకు తీసుకువచ్చాను. ప్రమాదంలో ఎవరికి ఏమీ కాలేదు. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగింది. ఇంట్లోని వస్తువులన్ని కాలిపోయాయి. గతంలో నాగార్జున సర్కిల్ వద్ద జరిగిన అగ్నిప్రమాదంలోనూ ఇద్దరిని రక్షించాను." - శ్రావణ్‌కుమార్, ట్రాఫిక్ కానిస్టేబుల్
Katedhan Fire Accident Today :మరోవైపు హైదరాబాద్ శివారు కాటేదాన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. హగ్గీస్ పరిశ్రమలో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి దట్టంగా పొగలు వ్యాపించాయి. వెంటనే స్ధానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, రెండు అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పేశారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో చుట్టు పక్కల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కామారెడ్డిలో భారీ అగ్ని ప్రమాదం - రూ.10 కోట్ల ఆస్తి నష్టం
మైలార్ దేవ్పల్లిలో భారీ అగ్నిప్రమాదం - తప్పిన ప్రాణ నష్టం