తెలంగాణ

telangana

ETV Bharat / state

ముగిసిన పంచాయతీ ఎన్నికల తొలిదశ నామినేషన్లు

ఏపీలో తొలివిడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈనెల 29న ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. 3 రోజుల పాటు కొనసాగిన ఈ ప్రక్రియ ఇవాళ సాయంత్రం 5 గంటలకు పూర్తైంది. విజయనగరం జిల్లా మినహా 12 జిల్లాలో 18 రెవెన్యూ డివిజన్ల పరిధిలో 168 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

ముగిసిన పంచాయతీ ఎన్నికల తొలిదశ నామినేషన్లు
ముగిసిన పంచాయతీ ఎన్నికల తొలిదశ నామినేషన్లు

By

Published : Jan 31, 2021, 7:26 PM IST

ఏపీలో తొలివిడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈనెల 29న ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. 3 రోజుల పాటు కొనసాగిన ఈ ప్రక్రియ ఇవాళ సాయంత్రం 5 గంటలకు పూర్తైంది. విజయనగరం జిల్లా మినహా 12 జిల్లాలో 18 రెవెన్యూ డివిజన్ల పరిధిలో 168 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 29న తొలిరోజున పంచాయతీల్లో 1,315, వార్డుల్లో 2200 నామినేషన్లు దాఖలు కాగా.. ఈనెల 30న 7,460 పంచాయతీల్లో, 23,318 వార్డుల్లో నామినేషన్లు దాఖలయ్యాయి. రెండు రోజుల్లో కలిపి పంచాయతీల్లో 8,773 , వార్డుల్లో 25,519 నామినేషన్లు దాఖలయ్యాయి.

ఇవాళ ఆఖరి రోజు కావడం వల్ల అన్నిచోట్లా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. పోలీసు బలగాలను మొహరించినా.. కొన్నిచోట్ల అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి. చిన్నపాటి ఘర్షణలు, దాడులు, అపహరణలు, నామ పత్రాలు లాక్కెళ్లడం, బెదిరింపులు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ కారణాలతో కొంత మంది అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు.

ఇవాళ దాఖలైన నామ పత్రాల వివరాలను కలెక్టర్లు క్రోడీకరిస్తున్నారు. వీటి పూర్తి వివరాలు ఏపీ ఎన్నికల సంఘం తెలియజేయనుంది. రేపు అన్నిచోట్ల నామినేషన్లను అధికారులు పరిశీలించనున్నారు. ఎల్లుండి అంటే ఫిబ్రవరి 2న తిరస్కరించిన నామినేషన్లను సంబంధిత రెవెన్యూ డివిజన్ల అధికారి వద్ద అప్పీలు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 3న అప్పిలేట్ అధికారి ద్వారా సమస్య పరిష్కారం చేసుకోవచ్చు. పిబ్రవరి 4న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది.

ఎవరైనా అభ్యర్థులు పోటీనుంచి నిష్క్రమించాలనుకుంటే వారి నామినేషన్ పత్రాలను ఆ సమయంలోపు వెనక్కి తీసుకోవచ్చు. అదే రోజున మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రచురిస్తారు. పిబ్రవరి 9న ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. తొలివిడతలో 3,249 పంచాయతీలకు, 32,504 వార్డులకు ఎన్నికలు జరగుతాయి. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. ఫలితాలు వెల్లడి ముగిశాక ఉప సర్పంచి ఎన్నిక చేపడతారు.

ఇదీ చదవండి: ఆపరేషన్​ స్మైల్​-7.. 223 మంది బాలలకు విముక్తి

ABOUT THE AUTHOR

...view details