పల్లెలకు కొత్త కళ తీసుకొచ్చేందుకే రాష్ట్రప్రభుత్వం 30 రోజుల ప్రణాళిక చేపట్టినట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులను ధృడ సంకల్పంతో పూర్తి చేసిన సీఎం కేసీఆర్ అదే చిత్తశుద్ధితో గ్రామాల రూపురేఖలు మారుస్తారని అన్నారు. సర్పంచ్లకు పూర్తి అధికారాలు ఇచ్చామని... గ్రామాల అభివృద్ధికి నిధులు కూడా కేటాయించామని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పల్లెల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. పల్లెల అభివృద్ధికై గ్రామస్థులను భాగస్వామ్యం చేసేలా ప్రణాళిక రూపొందించామన్నారు. పల్లెలను ప్రగతి పథంలో నడిపేందుకు కేసీఆర్ చేపట్టిన కార్యాచరణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందంటోన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో ఈటీవీభారత్ ముఖాముఖి...
'30 రోజుల ప్రణాళికతో పల్లెలకు కొత్త శోభ' - గ్రామాల అభివృద్ధికి 30 రోజుల ప్రణాళిక
గ్రామాల అభివృద్ధికి 30 రోజుల ప్రణాళికను రూపొందించినట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచనలతో పల్లెలను ప్రగతి పథంలో నడిపేందుకు కార్యాచరణ ప్రారంభించామని చెప్పారు. ప్రత్యేక నిధులు కేటాయించి గ్రామాల అభివృద్ధిలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తామని పేర్కొన్నారు.
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి
Last Updated : Sep 6, 2019, 7:51 AM IST
TAGGED:
village development programs