హైదరాబాద్‌లోని విరించి ఆస్పత్రి సీనియర్ వైద్యుడు కరోనాతో మృతి చెందారు. కొవిడ్‌తో చికిత్స పొందుతూ ఉదయం ఈశ్వర్ ప్రసాద్ కన్నుమూశారు. ఈశ్వర్ ప్రసాద్ విరించి ఆస్పత్రిలో సీనియర్ పల్మానాలజిస్ట్గా పని చేస్తున్నారు. ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రిలో ప్రొఫెసర్‌గా సేవలందించారు. ఆయన మరణం పట్ల ప్రముఖులు, వైద్యులు విచారం వ్యక్తం చేశారు.
కరోనాతో సీనియర్ పల్మానాలజిస్ట్ ఈశ్వర్ ప్రసాద్ మృతి - కరోనా వార్తలు
కరోనాకు బలవుతున్న వారి సంఖ్య రోజుకు రోజుకు పెరుగుతోంది. కొవిడ్ సామాన్యులనే కాదు వైద్యులను పొట్టనబెట్టుకుంటోంది. తాజాగా హైదరాబాద్‌లోని విరించి ఆస్పత్రి సీనియర్ వైద్యుడు కరోనాతో మృతి చెందారు.

సీనియర్ పల్మానాలజిస్ట్ ఈశ్వర్ ప్రసాద్