తెలంగాణ

telangana

ETV Bharat / state

నూతన విద్యావిధానంలో మార్పులు చేపట్టాలి: పల్లా - నూతన విద్యావిధానం మండలిలో చర్చ

యూజీసీ మార్గదర్శకాలకు అనుకుంగా నూతన విద్యావిధానంలో మార్పులు చేపట్టాలని రైతుబంధు అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి సూచించారు. యూజీసీ నిబంధనల మేరకు చివరి సంవత్సం చదివే విద్యార్ధులు పాస్‌ అయినట్లు కాదని.. తప్పనిసరిగా పరీక్షలు రాయాల్సి ఉంటుందన్నారు.

palla rajeshwar reddy speak im mlc on education system
నూతన విద్యావిధానంలో మార్పులు చేపట్టాలి: పల్లా

By

Published : Sep 9, 2020, 2:09 PM IST

అటానమస్‌ కాలేజీల సంఖ్యను పెంచాలన్న యూజీసీ, కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు రాష్ట్రంలోని నూతన విద్యావిధానంలో మార్పులు తీసుకురావాలని రైతుబంధు అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి సూచించారు. ఇక పరీక్షలు నిర్వహించకుండానే అందర్ని పాస్‌ చేస్తున్నారని, పరీక్షలు రాయాల్సిన పనిలేదనే అపోహలో విద్యార్ధులు ఉన్నారని... వారి ఆలోచన విధానంలో మార్పు తేవడానికి విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని ఆ శాఖ మంత్రిని కోరారు.

యూజీసీ నిబంధనల మేరకు చివరి సంవత్సం చదివే విద్యార్ధులు తప్పనిసరిగా పరీక్షలు రాయాల్సి ఉంటదన్నారు. యూజీసీ, కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు అన్ని వర్సిటీ పరిధిలో జరిగే పరీక్షలు, గ్రేడింగ్‌ విధానంలో మార్పులు తేవాలని సూచించారు.

నూతన విద్యావిధానంలో మార్పులు చేపట్టాలి: పల్లా

ఇదీ చూడండి:శాసనసభలో స్పీకర్‌తో విపక్షాల వాగ్వాదం

ABOUT THE AUTHOR

...view details