రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా తెరాస పార్టీదే విజయమని రైతు సమన్వయ సమితి ఛైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ సమాజం నాడి పసిగట్టడం, సరైన అభ్యర్థులను ఎంచుకోవడంలోనూ ప్రతిపక్షాలు మరోమారు విఫలమయ్యాయని ఎద్దేవా చేశారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో ఓటర్లు తెరాసకు బ్రహ్మరథం పట్టారని పేర్కొన్నారు. కరీంనగర్ కార్పొరేషన్‌లోనూ తెరాస ఘన విజయం సాధించబోతుందని తెలిపారు. రేయింబవళ్లు పార్టీ అభ్యర్థుల విజయం కోసం శ్రమించిన తెరాస కార్యకర్తలు, ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
'తొంభైశాతం సీట్లు మావే... ఓటర్లకు కృతజ్ఞతలు' - తెలంగాణ పురపోరు
మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం సీట్లు తెరాస కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ మున్సిపల్ ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రతిపక్షాలకు ఆశాభంగం తప్పదన్నారు.
telangana municipal elections Latest NEWS