తెలంగాణ

telangana

ETV Bharat / state

'పుట్టినరోజు సందర్భంగా రైతుబంధు సాయం వదులుకున్నారు'

రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్‌ను కలిశారు. సీఎం కేసీఆర్ పల్లాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్​కు పూల మొక్కను బహుకరించారు.

palla rajeshwar reddy Farmers rythu bandhu aid abandoned this season
'పుట్టినరోజు సందర్భంగా రైతుబంధు సాయం వదులుకున్నారు'

By

Published : Jul 11, 2020, 9:51 PM IST

రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ ఏడాది వానా కాలానికి రైతుబంధు పెట్టుబడి సహాయం 2,13,437 రూపాయలు "గివ్‌ ఇట్ అప్‌" పేరుతో వదులుకున్నట్టు పల్లా చెప్పారు. అదే మొత్తాన్ని రైతుబంధు సమితి పేరు మీద చెక్‌ రూపంలో సీఎం కేసీఆర్‌కు అందజేశారు.

శుభాకాంక్షలు

ఈ తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్​, శాసనమండలి మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కేటీఆర్‌, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాఠోడ్‌, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, రైతుబంధు సమితి సభ్యులు, రైతులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు.

గ్రీన్ ఛాలెంజ్

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ పల్లాకు శుభాకాంక్షలు తెలుపుతూ "గ్రీన్ ఛాలెంజ్" విసరారు. స్పందించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి తన ఇంటి ఆవరణలో దానిమ్మ, సీతాఫలం, సంపంగి మొక్కలను నాటాడు. రైతు బంధు సమితి సభ్యులు, అభిమానులు ఇదే గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి వందలాదిగా మొక్కలు నాటాలని ఆయన కోరారు.

ఇదీ చూడండి :మిగులు బడ్జెట్‌తో ఇస్తే కేసీఆర్ అప్పుల పాలు చేశారు: ఎంపీ కోమటిరెడ్డి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details