Palla Rajeshwar Reddy on crop damage in telangana : ముఖ్యమంత్రి ఆదేశాలతో అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, అధికారులు పంట నష్టాన్ని పరిశీలిస్తున్నారని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. పంటనష్టం అంచనాలు పూర్తయ్యాక రైతులను ఆదుకుంటామని స్పష్టం చేశారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
crop damage in telangana : గత తొమ్మిది సంవత్సరాలుగా కేంద్రం రాష్ట్రానికి ఎటువంటి నిధులు ఇవ్వకపోయినా.. రైతు ప్రభుత్వంగా కేసీఆర్ సర్కార్ అన్ని సౌకర్యాలు సమకూర్చుతున్నట్లు పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. రైతులకు 24గంటల ఉచిత విద్యుత్‌ను ఇస్తున్నట్లు గుర్తు చేశారు. పంట నష్టంపై గతంలో కేంద్రానికి ఎన్నిసార్లు అంచనాలు పంపినా నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. గతంలో రూ.7 వేల కోట్లు నష్టం వాటిల్లిందని కేంద్రానికి ప్రతిపాదనలు పంపితే కేవలం రూ.300 కోట్లు ఇచ్చిందని మండిపడ్డారు. పీఎం ఫసల్ బీమా యోజన వల్ల రైతులకు నష్టం జరిగి.. బీమా కంపెనీలకు లాభం జరుగుతోందని అభిప్రాయపడ్డారు.
Crop losses due to heavy rains in Telangana: మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈదురు గాలుల ప్రభావంతో ఎక్కడిక్కడ వరి, మొక్కజొన్న, మిరప, బొప్పాయి పంటలు నేలకొరిగాయి. వడగళ్ల వర్షాలతో మామిడి రైతులు కుదేలయ్యారు. నిమ్మ, నారింజ, దానిమ్మ వంటి పండ్ల తోటలకు అపారనష్టం వాటిల్లింది. అధిక మొత్తంలో అప్పులు చేసి పంటలు వేశామని.. ఈ కష్ట కాలంలో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. లేకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు.
"రైతులకు రైతుబంధు ద్వారా ఏడాదికి రూ.15 వేల కోట్లు ఇస్తున్నాం. అన్ని నియోజకవర్గాల్లో పంటనష్టాన్ని ఎమ్మెల్యేలు, అధికారులు పరిశీలిస్తారు. పంటనష్టం అంచనాలు పూర్తయ్యాక రైతులను ఆదుకునే చర్యలు చేపడతాం. పంటనష్టంపై గతంలో కేంద్రానికి ఎన్నిసార్లు అంచనాలు పంపినా నిధులు ఇవ్వలేదు. గతంలో రూ.7 వేల కోట్లు నష్టం వాటిల్లిందని ప్రతిపాదనలు పంపితే కేవలం రూ.300 కోట్లు ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం లేని రాష్ట్రాలకు కేంద్రం ఏ రకంగాను సహాయపడట్లేదు. పీఎం ఫసల్ బీమా యోజన వల్ల రైతులకు నష్టం జరుగుతోంది, బీమా కంపెనీలకు లాభం జరుగుతోంది. పీఎం ఫసల్ బీమా యోజన పథకం నుంచి గుజరాత్ రాష్ట్రం కూడా తప్పుకుంది." -పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ