తెలంగాణ

telangana

ETV Bharat / state

Palla Rajeshwar Reddy: 'రేవంత్‌రెడ్డికి తప్ప రైతులెవరికీ ఎలాంటి ఇబ్బందులు లేవు' - palla rajeshwar reddy latest news

Palla Rajeshwar Reddy: ధాన్యం సేకరణపై కాంగ్రెస్‌, భాజపా నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. రాజకీయ కక్షతోనే రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తెలంగాణలోని ధాన్యం సేకరించకుండా భాజపా నేతలు అడ్డుకున్నారని పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. 2014 నుంచి ధాన్యం ఎలా సేకరించామో విపక్షాలకు తెలియదన్న ఆయన ఇప్పటికే అన్ని జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు.

Palla Rajeshwar Reddy: 'రేవంత్‌రెడ్డికి తప్ప రైతులెవరికీ ఎలాంటి ఇబ్బందులు లేవు'
Palla Rajeshwar Reddy: 'రేవంత్‌రెడ్డికి తప్ప రైతులెవరికీ ఎలాంటి ఇబ్బందులు లేవు'

By

Published : Apr 24, 2022, 3:16 PM IST

Palla Rajeshwar Reddy: ధాన్యం సేకరణపై భాజపా, కాంగ్రెస్‌ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. రాజకీయ కక్షతోనే రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌ ‌అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 వేల కోట్ల నష్టాన్ని భరించేందుకు సిద్ధపడి.. రాష్ట్రసర్కార్‌ ధాన్యం కొనుగోలు చేస్తుంటే విపక్షాలు ఇబ్బందులు కలిగిస్తున్నాయని ఆరోపించారు. ఇలాగే వ్యవహరిస్తే రైతుల ఆగ్రహం చూడాల్సి వస్తోందని అన్నారు.

'రేవంత్‌రెడ్డికి తప్ప రైతులెవరికీ ఎలాంటి ఇబ్బందులు లేవు'

కేంద్రం తెలంగాణలోని ధాన్యం సేకరించకుండా భాజపా రాష్ట్ర నేతలు అడ్డుకున్నారని పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. 2014 నుంచి ఇప్పటివరకు ధాన్యం ఎలా సేకరించామో విపక్షాలకు తెలియదన్న ఆయన... ఇప్పటికే అన్ని జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. ధాన్యం సేకరణ సక్రమంగా సాగుతోందన్న పల్లా.. రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు.

రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొడుతున్నారు: భాజపా నేతలకు రేవంత్ రెడ్డి తోడై తెలంగాణ రైతులకు శాపంలా మారారని పల్లా అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి తప్ప రైతులెవరికీ ఇబ్బందులు లేవని చెప్పారు. రేవంత్‌రెడ్డి ఇలాగే వ్యవహరిస్తే ప్రజల ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. రైతుల ఆత్మహత్యలపై రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడుతున్నారని.. రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్, హిందీ అర్థం కానట్టుందన్నారు. నలుగురు భాజపా ఎంపీలు ధాన్యం సేకరణకు అడ్డుపడుతూ నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రయోజనాలకు గండి కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మెడికల్ కాలేజి సీట్ల భర్తీ పై రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలతో గవర్నర్​కు లేఖ రాశారని.. తమ ప్రమేయంపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని మంత్రులు పువ్వాడ అజయ్, మల్లా రెడ్డి స్పష్టంగా చెప్పారన్నారు. రేవంత్ రాజకీయ సన్యాసం మాటలు అన్ని ఉత్తవేనని.. గతంలో కొడంగల్​లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని మాట తప్పారన్నారు.

'2014 నుంచి నేటి వరకు ధాన్యం ఎలా సేకరించామో కూడా విపక్షాలకు తెలియదు. 2020-21లో ఎఫ్‌సీఐకి 141.1 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం అమ్మాం. రాష్ట్రంలో ప్రజలను, కేసీఆర్‌ను ఇబ్బందిపెట్టాలని కేంద్రం చూస్తోంది. రాష్ట్రంలో ధాన్యం సేకరణ సరిగా జరగట్లేదని రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. రూ.3 వేల కోట్లు నష్టం వచ్చినా భరించేందుకు కేసీఆర్‌ ముందుకొచ్చారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరణ చర్యలు చేపట్టాం. రేవంత్‌రెడ్డికి తప్ప రైతులెవరికీ ఎలాంటి ఇబ్బందులు లేవు. పీయూష్‌ గోయల్‌కు 11 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనాలని చెప్పాం. కేంద్రం పారా బాయిల్డ్‌ రైస్‌ తీసుకోవాలని ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా ప్రభుత్వాలు కూడా కోరాయి. రేవంత్‌రెడ్డి ఇలాగే వ్యవహరిస్తే ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుంది. 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రేవంత్‌ అవాస్తవాలు చెప్పారు.' -పల్లా రాజేశ్వర్​ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు

ప్రజలు నవ్వుకుంటున్నారు: పాదయాత్రలో బండి సంజయ్ మాట్లాడుతున్న మాటలను చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. మాది తెలంగాణ అస్థిత్వం అయితే భాజపా నేతలది గుజరాత్ బానిసత్వం అని ఆయన విమర్శించారు. భాజపా నేతలు సమాజంలో తక్కువగా సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా ఉంటున్నారన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అబద్ధాలకు అంతే లేకుండా పోయిందని.. ప్రొఫార్మా సరిగా నింప లేదని తెలంగాణకు మెడికల్ కాలేజి ఇవ్వలేదని కిషన్ రెడ్డి అనడం సిగ్గు చేటన్నారు. గుజరాత్​కు బానిసగా మారి తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని బాల్క సుమన్​ విమర్శలు గుప్పించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details