తెలంగాణ

telangana

ETV Bharat / state

పాకిస్థాన్​ టు కర్నూలు... అదో ట్విస్ట్..!​ - పాకిస్థాన్​ టూ కర్నూలు లవ్​స్టోరీ న్యూస్

ఒకటా.. రెండా.. పదకొండేళ్ల క్రితం పాకిస్థాన్​ నుంచి వచ్చాడో వ్యక్తి. ఇక్కడే పని.. ఇక్కడే నివాసం.. ఇక్కడే పెళ్లి.. పిల్లలు. మళ్లీ మనసుకు ఏమనిపించిందో... పాకిస్థాన్​ వెళ్లాలనుకున్నాడు. అసలు ఎందుకు వచ్చాడు..? ఎవరైనా పంపారా...? ఇక్కడి మహిళ అతడిని నమ్మి ఎలా వివాహం చేసుకుంది..? అక్కడేదైనా.. చేసి ఇక్కడికి వచ్చాడా..? ఇప్పుడు పోలీసుల మదిలో మెదిలే ప్రశ్నలివే..!

PAK
పాకిస్తాన్ టూ కర్నూల్... అదొక ట్విస్ట్

By

Published : Dec 8, 2019, 10:20 AM IST

పదకొండేళ్ల క్రితం పాకిస్థాన్​కు చెందిన గుల్జార్ ఖాన్ సౌదీ అరేబీయా వెళ్లారు. అక్కడి నుంచి భారత్ వచ్చారు. కర్నూలులోని గడివేములలో నివాసం ఏర్పరుచున్నారు. ఈ క్రమంలోనే దౌలత్​బీ అనే వితంతువును ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి నలుగురు సంతానం. గుల్జార్ కుటుంబం అంతటికీ పాస్​పోర్టులు తీసుకున్నాడు. నాలుగు రోజుల క్రితం సౌదీ అరేబియా మీదుగా పాకిస్థాన్​ వెళ్లేందుకు బయలుదేరాడు. ఈ క్రమంలోనే శంషాబాద్ విమానాశ్రయంలో గుల్జార్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భార్య పిల్లలను కర్నూలు పంపి... అతడిపై కేసు నమోదు చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలు ఏమైనా నిర్వహించాడా అని నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి.

ఎలా దొరికాడంటే..?

ఇండియా నుంచి పాక్‌లోని సియాల్‌కోట్‌కు ఫోన్లు వెళుతుండటంతో ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారు. రహస్యంగా దర్యాప్తు చేశారు. సెల్‌ టవర్‌ సిగ్నల్స్‌ ఆధారంగా కర్నూలు జిల్లా గడివేముల నుంచి ఫోన్లు వెళుతున్నట్లు గుర్తించారు. ఈ మధ్యేనే గుల్జార్ పాస్‌పోర్టు తీసుకోవడంతో... ఆయన కదలికలపై నిఘా పెట్టారు. ఇక కుటుంబం మొత్తానికి పాస్‌పోర్ట్ తీసుకొని.. గుల్జార్ భార్య, పిల్లలతో కలిసి హైదరాబాద్‌ వెళ్లగా.. అక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు వీరికి ప్రధాన సమస్య ఏంటంటే.. గుల్జార్​కు భారతీయ పౌరసత్వం లేదు. అతడి భార్యకు పాక్ పౌరసత్వమే సమస్య.

ఇదీ చదవండి:స్వతంత్ర దర్యాప్తు తప్పనిసరి.. ఎన్‌కౌంటర్లపై మార్గదర్శకాలు

ABOUT THE AUTHOR

...view details