తెలంగాణ

telangana

ETV Bharat / state

తిరుపతిలో అన్యమత ప్రచారం కలకలం - తిరుపతిలో అన్యమత ప్రచారం కలకలం

తిరుపతి స్విమ్స్‌లో అన్యమత ప్రచారం కలకలం రేపింది. తితిదే ఆధ్వర్యంలో నిర్వహించే ఆసుప్రతిలో... అన్యమత చిహ్నాలు దర్శనమిచ్చాయి. ఆస్పత్రి ఆవరణలోని చెట్లపై కొందరు పెయింట్‌తో చిహ్నాలు వేశారు. ఆస్పత్రి భద్రతా సిబ్బంది నిర్లక్ష్యమే దీనికి కారణమంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Pagan propaganda in Tirupati
తిరుపతిలో అన్యమత ప్రచారం కలకలం

By

Published : Jan 2, 2020, 2:44 PM IST

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే స్విమ్స్‌ ఆస్పత్రి ఆవరణలో చెట్లపై అన్యమత చిహ్నాలు కలకలం రేపాయి. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చెట్లపై అన్యమత చిహ్నాలను పెయింట్​తో వేశారు. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని ఆరోపిస్తున్నారు.

స్పందించిన భద్రతాధికారి

చెట్లపై అన్యమత చిహ్నాలపై స్విమ్స్​ ముఖ్య భద్రత పర్యవేక్షణాధికారి ఎలాంగో రెడ్డి స్పందించారు. డిసెంబర్​ 31న రాత్రి ఘటన జరిగినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. వెంటనే చెట్లపై చిహ్నాలను తొలగించినట్లు వెల్లడించారు. ఘటనా స్థలంలో సీసీ కెమెరాలు లేవని.. ఆ రోజు సిబ్బంది తక్కువగా ఉన్నారని పేర్కొన్నారు. దీనిపై అలిపిరి పోలీసులకు సమాచారమిచ్చామన్న ఆయన.. అంతర్గత విచారణ చేపట్టినట్లు వివరించారు.

తిరుపతిలో అన్యమత ప్రచారం కలకలం

ఇదీ చూడండి: అనంతగిరి ఘటనపై స్పందించిన డీజీపీ మహేందర్​రెడ్డి...

ABOUT THE AUTHOR

...view details