ప్రతి ప్రదర్శనను తొలి ప్రదర్శనగా భావించి నాట్యానికి జీవితాన్ని అంకితం చేసిన మహానృత్య కళాకారిణి శోభానాయుడు అని పలువురు వక్తలు కొనియాడారు. శోభానాయుడు లేని కూచిపూడి నాట్యం ఊహకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు నేల, కూచిపూడి నాట్యం ఉన్నంత కాలం ఆమె అందరి మదిలో నిలిచి ఉంటారని అన్నారు.
'తెలుగు నేల ఉన్నంతకాలం శోభానాయుడు ఉంటారు' - padmashree shobha naidu birth anniversary
శోభానాయుడు లేని కూచిపూడి నాట్యం ఊహకు అందడం లేదని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లోని తెలంగాణ సారస్వత పరిషత్లో నర్తన శోభ పేరిట పద్మశ్రీ డా.శోభానాయుడు జయంతి వేడుకను నిర్వహించారు.
పద్మశ్రీ శోభానాయుడు, శోభానాయుడు జయంతి, నర్తన శోభ
హైదరాబాద్లోని తెలంగాణ సారస్వత పరిషత్లో శ్రీ శివసాయి మానస సరోవర్ ఇంటర్నేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నర్తన శోభ పేరిట పద్మశ్రీ డా.శోభానాయుడు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకకు రాష్ట్ర సాంస్కృతిక సంచాలకులు మామిడి హరికృష్ణ, కళాపత్రిక సంపాదకులు మహ్మద్ రఫీ, కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యులు పండిట్ అంజుబాయి, డాక్టర్ అమలాపురం కన్నారావు పాల్గొన్నారు.
- ఇదీ చదవండి :అత్యవసర నిధి ఏర్పాటు చేసుకున్నారా?