తెలంగాణ

telangana

ETV Bharat / state

'పద్మశాలీలకు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించండి'

హైదరాబాద్ నారాయణగూడలోని పద్మశాలీ భవన్​లో పురపాలక ఎన్నికలపై అత్యవసర కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

Padmashalies on muncipal election reservations
'పద్మశాలీలకు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించండి'

By

Published : Jan 8, 2020, 10:44 PM IST

మున్సిపల్ ఎన్నికల్లో పద్మశాలీలకు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మ్యాడం బాబురావు వివిధ రాజకీయ పార్టీలను కోరారు. హైదరాబాద్ నారాయణగూడలోని పద్మశాలి భవన్​లో పురపాలక ఎన్నికలపై అత్యవసర కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

తెలంగాణలో జనాభా పరంగా అధిక శాతం పద్మశాలీలు ఉన్నా... రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో వెనుకబడిన పద్మశాలీలను గుర్తించి... వారికి రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని పార్టీల నాయకులకు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పద్మశాలీ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

'పద్మశాలీలకు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించండి'

ఇవీ చూడండి: మున్సిపాలిటీగా అవతరించిన నందికొండ కథేంటీ...!

ABOUT THE AUTHOR

...view details