కొవిడ్ పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ(GHMC) కార్మికుల కృషి ప్రశంసనీయమని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్(padma rao goud) అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ఐదు మున్సిపల్ డివిజన్లకు సంబంధించిన జీహెచ్ఎంసీ(GHMC) పారిశుద్ధ్య సిబ్బందికి సీతాఫల్మండిలో సేఫ్టీ కిట్లను ఆయన పంపిణీ చేశారు.
padma rao goud: పారిశుద్ధ్య సిబ్బందికి సేఫ్టీ కిట్లు పంపిణీ - ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్
సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ఐదు మున్సిపల్ డివిజన్లకు సంబంధించిన జీహెచ్ఎంసీ(GHMC) పారిశుద్ధ్య సిబ్బందికి... సీతాఫల్మండిలో సేఫ్టీ కిట్లను ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్(padma rao goud) అందజేశారు. కరోనా పరిస్థితుల్లో వారు చేస్తున్న సేవలు మరువలేనివని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప సభాపతి స్పష్టం చేశారు. కరోనాను పూర్తిగా నివారించే క్రమంలో చేపడుతున్న చర్యలు… మంచి ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు. కార్మికుల కృషిని గుర్తిస్తూ వారిని ప్రోత్సహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్ కుమారి సామాల హేమ, ఉప కమిషనర్ మోహన్ రెడ్డి, అధికారులు డాక్టర్.రవీందర్ గౌడ్, గీత, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:YS Sharmila:ఈటల.. పార్టీలో చేరతానంటే స్వాగతిస్తా: వైఎస్ షర్మిల